విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలు, దేశానికి చేసిన సేవలు కొనియాడారు. నేటి భావితరాల వారికి ఆయన ఒక మార్గదర్శి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, వి.గురునాదం, అల్లం రాజేష్, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Prajavartha Online Telugu News