Breaking News

జిల్లా స్థాయి క్రీడా మహోత్సవం 2025–2026 ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“మేరా యువ భారత్-మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ” ఆధ్వర్యంలో, శ్రీ వెంకటేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ bhimadole , Eluru వేదికగా 2025–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యువతలో క్రీడా స్పూర్తి, నాయకత్వం, సమూహ భావన, శారీరక-మానసిక వికాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ క్రీడా పోటీలను జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలలు, విద్యాసంస్థల నుండి వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు .వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించబడ్డాయి .కళాశాల ప్రిన్సిపల్ బి రవి కుమార్, కరస్పాండెంట్ డిఎంవి భవాని సింగ్ , డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర రాము ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ కు శ్రీ వెంకటేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్‌ చక్కని వేదిక అని తమ ప్రోత్సహకం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ యుత్ ఆఫీసర్ సుంకర రాము మాట్లాడుతూ, కొత్త తరానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసే వేదికగా ఈ పోటీలు పనిచేస్తాయని అభినందించారు.
విద్యార్థులు క్రీడల ద్వారా క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ప్రిన్సిపాల్ బి రవి కుమార్ మాట్లాడుతూ, “మేరా యువ భారత్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే అపూర్వ అవకాశం లభించింది. మా కాలేజ్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా భావిస్తున్నాం,” అని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ సురేష్ విద్యార్థుల సమిష్టి కృషితో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. విజేతలకు పతకాలు, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేసారు .ఈ కార్యక్రమం లో కాలేజ్ ప్రిన్సిపల్ బి రవికుమార్ , మేరా యువభారత్ వాలంటీర్లు జక్కుల రోహిత్ కుమార్, సుమలత, మమత సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కాకర్ల రాణి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *