విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో (CWC) చైర్‌పర్సన్లు, సభ్యులు, జువెనైల్ జస్టిస్ బోర్డులలో (JJB) సోషల్ వర్కర్ సభ్యులుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ డిసెంబర్ 9, 2025న నోటిఫికేషన్ విడుదల చేయడమైనది.
ఈ దరఖాస్తులను సమర్పించడానికి గతంలో నిర్ణయించిన గడువు డిసెంబర్ 22, 2025 తో ముగిసింది. అయితే, అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును 29.12.2025 వరకు పొడిగించాలని నిర్ణయించడమైనది.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ వెబ్‌సైట్: http://wdcw.ap.gov.in ద్వారా మాత్రమే సమర్పించాలన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సందర్శించి 29.12.2025 లోపుగా దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది.
బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు (FAC)ఎమ్. వేణు గోపాల్ రెడ్డి ఆ ప్రకటనలో తెలియజేశారు.
Prajavartha Online Telugu News