Breaking News

స్వాధీనం చేసుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణి బియ్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం – 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనం చేసుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణి (PDS) బియ్యంను నిబంధనల మేరకు బహిరంగ విధానంలో విక్రయించ నున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ / కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. మేఘా స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బియ్యం విక్రయానికి సంబంధించి తేది: 05.01.2026 న మధ్యాహ్నం 3.00 గంటలకు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) గారి ఛాంబర్ వద్ద, సంబంధిత అధికారుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియలో పాల్గొనదలచిన వారు తేది: 03.01.2026 న జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచిన PDS బియ్యం నమూనాలను పరిశీలించుకోవచ్చని మేఘా స్వరూప్ తెలిపారు..అలాగే, ఇందులో పాల్గొనే వారు నిర్ణీత నిబంధనల ప్రకారం రూ.50,000/- ధరావత్తు సొమ్మును చెల్లించి, నిర్దిష్ట నమూనాలో దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. తప్పనిసరిగా GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రతిని సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 6-A కేసులు నమోదు అయి పెండింగ్‌లో ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనుటకు అనర్హులని జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలు, పారదర్శకతకు అనుగుణంగా ఈ విక్రయ ప్రక్రియ నిర్వహించ బడుతుందని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *