Breaking News

షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429 వ ఉరుసు మహోత్సవాలకు మంగ‌ళ‌వారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్, టిడిపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ల‌తో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబా ఆశీస్సులు పొందారు. ఆ త‌ర్వాత భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా వుందన్నారు. ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ స‌హ‌కారంతో భ‌క్తుల ఏటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్య‌క్ర‌మం టిడిపి కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామ‌య్య‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ అక్క‌ల గాంధీ, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పైజాన్ ల‌తోపాటు ఎన్డీయే కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *