Breaking News

డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం డ్రైవర్లకు రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమం, నేత్ర పరీక్షలు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమని, రోడ్డు కండిషన్ మరియు ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని పరిమిత స్పీడ్ తో వాహనాలను నడపాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు డ్రైవింగ్ లో ఏకాగ్రత అవసరమన్నారు. రహదారులపై వాహనాలను నిలుపవద్దని డ్రైవర్లను ఆయన కోరారు. డ్రైవర్లు ప్రమాదాలలో మరణిస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ విషయం దృష్టిలో ఉంచుకొని వాహనాలను జాగ్రతతో నడపాలని డ్రైవర్లను చూచించారు. నిద్ర మత్తు కూడా ప్రమాదాలకు కారణమవుతుందని  తెలిపారు. డ్రైవర్లందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవర్లు సురక్షితమైన డ్రైవింగ్ చెయ్యగలరని అన్నారు.  డ్రైవర్లకు బీ.పి, షుగర్, మరియు ఐ చెక్ అప్ లను ఉచితంగా నిర్వహించడం తో పాటు, డ్రైవర్లకు ప్రథమ చికిత్స పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు, టాక్సీ ఓనర్స్ అసోసియేషన్, స్కూల్ బస్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *