Breaking News

డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని జిల్లా న్యాయ సేవల అధికారం (DLSA) చైర్మన్ కమ్ ప్రధాన జిల్లా న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం ప్రాథమికంగా రెండు సంవత్సరాల కాలానికి లేదా సవరించిన స్కీమ్, 2022 మార్గదర్శకాల ప్రకారం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు గుంటూరు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను https://guntur.dcourts.gov.in సందర్శించవచ్చని పేర్కొన్నారు.

డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కు క్రిమినల్ లా లో 1 నుండి 7 సంవత్సరాల న్యాయవృత్తి అనుభవం,
క్రిమినల్ చట్టాలపై ఉత్తమ అవగాహన, ఉత్తమ మౌఖిక, లిఖిత కమ్యూనికేషన్ నైపుణ్యాలు, లీగల్ రీసెర్చ్ నైపుణ్యాలు, డిఫెన్స్ కౌన్సెల్ నైతిక బాధ్యతలపై సంపూర్ణ అవగాహన, ఇతరులతో సమర్థవంతంగా, ఫలప్రదంగా పని చేసే సామర్థ్యం, సెషన్స్ కోర్టుల్లో కనీసం 20 క్రిమినల్ ట్రయల్స్ నిర్వహించి ఉండాలన్నారు. ఐటీ పరిజ్ఞానం మరియు కంప్యూటర్ పనిలో నైపుణ్యం ఉండాలని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *