Breaking News

వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో గ్రామీణ భారతానిది కీలక పాత్ర : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

-గ్రామీణ జీవనోపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘వీబీ – జీ రామ్ జీ’ దోహదం
-విజయనగరంలో పాత్రికేయుల కోసం పీఐబీ (PIB) విజయవాడ ‘వార్తాలాప్’ నిర్వహణ

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో గ్రామాలను భాగస్వామ్యం చేసేందుకు కొత్తగా తెచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్’ (VB G RAM G) ఎంతో దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (విజయవాడ) నిర్వహించిన మీడియా వర్క్‌షాప్ ‘వార్తాలాప్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు ఈ చట్టం ఒక సమగ్ర మార్గమని ఆయన పేర్కొన్నారు. నూతన చట్టం ద్వారా ఒక ఆర్థిక ఏడాదిలో పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం అతిపెద్ద మార్పు అని అన్నారు. వీబీ జీ రామ్ జీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల కల్పన, స్థానికులకు జీవనోపాధి కల్పించడంపై దృష్టి పెడుతుందని వివరించారు. ఈ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే మీడియా ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పాత్రికేయులను ఎంపీ అప్పలనాయుడు కోరారు.

పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) విజయవాడ, డైరెక్టర్ జి. సురేష్ కుమార్ వార్తాలాప్ ఉద్దేశాలను వివరిస్తూ, ఈ పథకంలో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, మీడియాకు మధ్య వారథిగా పీఐబీ పనిచేస్తోందని తెలిపారు. పని దినాల పెంపు, వ్యవసాయ సమయంలో ఇచ్చే జీవనోపాధి సెలవు వంటి అంశాలు లబ్ధిదారులకు, రైతులకు ఎంతో మేలు చేస్తాయన్నారు.

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (MGNREGS) డైరెక్టర్ వై.వి.కె. షణ్ముఖ కుమార్ ఈ పథకంపై జిల్లా పాత్రికేయులకు సమగ్రమైన అవగాహన కల్పించారు.

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న జిల్లాల్లో విజయనగరం ముందుందని వెల్లడించారు. కేవలం ఉపాధి కల్పన మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల కల్పనపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. లబ్ధిదారుల ఆదాయం పెంచటమే కాకుండా, అవినీతిని కట్టడి చేసేందుకు కృత్రిమ మేధ (AI), జీపీఎస్ ఆధారిత జియో-ట్యాగింగ్ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగిస్తున్నట్టు వివరించారు.

ఈ వార్తాలాప్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాల నుంచి వలసలను అరికట్టడానికి పలు సూచనలు చేశారు. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల మధ్య వనరుల పంపిణీలో అసమానతలు లేకుండా చట్టంలో నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఈ నూతన చట్టం కారణంగా ఇకపై వారానికోసారి చెల్లింపులు జరుగుతాయని, పని కల్పించడంలో విఫలమైతే నిరుద్యోగ భృతి తప్పనిసరి అని తెలిపారు. నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, విపత్తు సన్నద్ధత వంటి అంశాలకు ఈ పథకంలో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపీచంద్, లీడ్ బ్యాంక్ అధికారులు వి.వి. రమణమూర్తి, అనిల్, డ్వామా పీడీ శారదా దేవి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *