Breaking News

ఉత్సాహంగా కొనసాగిన సాంస్కృతిక కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలో ఉత్సాహంగా కొనసాగాయి. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కళాశాల  ఆధ్వర్యంలో  హిమబిందు గాత్రం కచేరి చేశారు, వివిధ వాగ్గేయ కళాకారుల రచించిన కీర్తనలు శ్రవణానందంగా గానం చేసి, వీక్షికులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గరగల్లు నృత్యం అద్భుతంగా ప్రదర్శించారు. పంజాబ్ ,వెస్ట్ బెంగాల్ కళాకారులు బాంగ్రా నృత్యాన్ని ఉత్సాహంగా ప్రదర్శించారు. సాంప్రదాయ, వెస్ట్రన్ డాన్స్ లు ప్రదర్శించారు. డిఆర్డిఏ మేనేజర్ మహిత, పెద్ద సంఖ్యలో సందర్శకులు వీక్షించారు.
సరస్ మేళా లో ఆదివారం ప్రదర్శనలు
సరస్ మేళా లోని కళావేదికపై ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాజస్థాన్ కాల్బెలియా నృత్యం, ఎల్లూరు వీరనాట్యం, ఏపీ ఆర్ ఎస్, హిందూ కళాశాల విద్యార్థులు యోగ ఏరోబిక్ డాన్స్, ఇతర నృత్యాలు ప్రదర్శించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *