Breaking News

విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టండి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టమని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె. అర్జున రావు అన్నారు. శనివారం ఉదయం బయాలజీస్ట్, మలేరియా సిబ్బంది తో యాంటీ లార్వా ఆపరేషన్ విస్తృతంగా చేప్పటాలని ఆదేశించారు. సైడ్ డ్రైన్ లలో నీటి నిలువల వల్ల కాలువలో దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నందున వాటిలో డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేసి, సైడ్ డ్రైన్ లో నీటి ప్రవాహం లో ఎటువంటి ఆటంకం లేకుండా పరిశుభ్రపరిచి, యాంటీ లార్వా ఆపరేషన్ లో భాగంగా దోమలు ఉత్పత్తి చెందకుండా ఎం.ఎల్ ఆయిల్ స్ప్రే, ఫోగ్గింగ్ చెయ్యాలని అన్నారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కలను పరిశుభ్రపరచటమే కాకుండా ఎం.ఎల్ ఆయిల్ స్ప్రే చేసి, కలవపైన దోమలు ఉత్పత్తి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవైపు మలేరియా సిబ్బంది బోట్ల సహాయంతో గొర్రెపుడెక్కలను తొలగించి, కాల్వ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకొని ప్రజలకు దోమల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *