-రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ డిమాండ్
-ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ సర్కిల్ లో ధర్నా
-అంబటి చిత్ర పటాలను తగలబెట్టిన టిడిపి నాయకులు
-అంబటి అనుచిత వ్యాఖ్యలపై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
-ధర్నాలో పాల్గొన్న గద్దె క్రాంతి, టిడిపి కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామాంలో వైసిపి నేతలు అనుసరిస్తున్న బూతు రాజకీయాలకు చోటు లేదు. సంస్కార హీనంగా అసభ్యకరమైన, అశ్లీల పదజాలంతో సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి నాయకుడు అంబటి రాంబాబు పై తక్షణం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్ డిమాండ్ చేశారు.
ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ…టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ ఆధ్వర్యంలో శనివారం పటమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర టిడిపి నాయకులతో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అంబటి రాంబాబు చిత్ర పటాలను చీపురుతో కొట్టి దగ్ధం చేశారు. అనంతరం టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, టిడిపి యువనాయకుడు గద్దె క్రాంతి, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి పటమట పోలీసు స్టేషన్ లో అంబటి రాంబాబు పై ఏసిపి దామోదర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ ప్రజలు ఛీత్కరించుకున్న వైసిపి నేతలకు ఇంకా బుద్ది రాలేదని….సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలం అంబటి నీచత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వైసిపి ఒక రాజకీయ పార్టీ కాకుండా…గుండాలు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు అంతు తేల్చే వరకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎవరు నిద్రపోరని హెచ్చరించారు. అంబటి రాంబాబు ఒక సైతాన్ అంటూ….వైసిపి తో పాటు ఆ పార్టీ నాయకులు చరిత్ర హీనులుగా మిగలటమే కాకుండా కాలగర్బంలో కలిసిపోయే రోజులు దగ్గరలో వున్నాయన్నారు.
పోలవరం డ్యాం గురించి, క్యూసెక్కులు, కాఫర్ డ్యామ్ అంటే కూడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి వైసీపీ హయాంలో జలవనరులల శాఖ మంత్రిగా చేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అన్నారు. మహిళలు అంటే అతనికి ఎంత గౌరవం కూడా అరగంట, గంట అంటూ మాట్లాడిన సంభాషణలు కూడా రాష్ట్ర ప్రజలందరూ విన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Prajavartha Online Telugu News