-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ –
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇది వికసిత భారత్ మోడీ ౩.0 – 53.47 లక్షల కోట్లు స్వదేశీయతను అణువణువున నింపిన బడ్జెట్ ఇది – ముఖ్యమైన అన్ని రంగాలలో దేశ స్వయం సమృద్ధ సమ్మిళిత అభివృద్ధి నిర్దేశించే మోడీ మార్క్ యువ శక్తి , సబ్ కా సాత్- సబ్ కా వికాస్ మహిళ మరియు మధ్య తరగతి ఉన్నతి ఉద్దేశించిన 3 కర్తవ్యాల ఆధారిత బడ్జెట్.
ఈ బడ్జెట్ స్వదేశీ మరియు అంత్యోదయ స్ఫూర్తితో రూపొందించిన వికసిత్ భారత్ బడ్జెట్
అతి ఎక్కువసార్లు వరుసగా 9 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళ ఆర్ధిక మంత్రిగా నిర్మల సీతారామన్ గారు రికార్డ్ సృష్టించారు, భారత నారిశక్తిని చూపారు.
రైతుల శ్రేయస్సు కోసం ఏ అంతర్జాతీయ ఒత్తిడికి లొంగని బడ్జెట్.
మహాత్మా గాంధీ స్వరాజ్య పథకం క్రింద ఖాదీ పరిశ్రమల ఉన్నతికి ప్రోత్సాహం.
ఆర్మనిర్భరత, సంస్కరణల కొనసాగింపు, కొనుగోలు శక్తి పెంచుతూ, అధిక ఆర్ధిక వృద్ధికొనసాగించడం.
బయో ఫార్మా ప్రపంచ శక్తిగా దేశాన్ని బలోపేతం చేయడానికి 3 కేంద్రాల ఏర్పాటు.
హై స్పీడ్ రైల్వే కారిడార్ 7 లో ఆంధ్ర ప్రదేశ్ 3 కారిడార్లలో అనుసంధానం అవుతుంది
అరుదైన భూ ఖనిజాల ప్రాజెక్టుల వృద్ధి కోసం తెలిపిన 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కు చోటు లభించింది.
అరకు మరియు పులికాట్ సరస్సు ల పర్యాటక వృద్ధి కోసం ప్రత్యేక నిధులు
ప్రతి పెద్ద నగరపాలిక సంస్థలకు 1000 కోట్ల మేరకు బాండ్లు ద్వారా నిధుల సమీకరణకు అవకాశం, అందులో 100 కోట్లు కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తుంది. ఈ నిధుల అనుసంధానం తో పట్టణాల సమస్యల నుండి అభివృద్ధి కోసం లక్ష కోట్లు, అమృత్ 1 .0 మరియు అమృత్ 2.0 లో ఇచ్చే నిధులతో పట్టణాల మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం.
పూర్వోదయ అభివృద్ధికి నిధులు ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ అంశంలో నిధులు అందుతాయి.
20 నేషనల్ వాటర్ వేస్ ప్రకటన జల రవాణాలో ప్రాధాన్యత సంతరించుకుంది.
10 సెక్టార్లలో 1,00,000 ఏ హెచ్ పీ లను ఏర్పాటు మరియు 5 రీజనల్ మెడికల్ టూరిజం రీజనల్ హబ్ లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు. యోగ మరియు ఆయుర్వేద ఉత్పత్తులు సప్లై కోసం చర్యలు.
విద్య, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యాపారవేత్తలుగా యువతను తీర్చిదిద్దడానికి హై పవర్ కమిటీ మరియు 5 యూనివర్సిటీ టౌన్షిప్ లను పారిశ్రామిక కారిడార్లలో ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ కు ప్రకటన.
షీ ( సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్స్ ) ద్వారా లాక్ పతి దీదీలకు రుణాలు మంజూరు తేలికగా చేయడానికి ఊతం.
అత్యధునిక ట్రామా మరియు ఎమర్జన్సీ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం.
17 రకాల లైఫ్ క్యాన్సర్ డ్రగ్స్ పైన డ్యూటీ మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయం.
ప్రతి జిల్లాలో ఓకే మహిళా హాస్టల్ – వీజీఎఫ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
16 వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిన 41% గ్రాంట్లను ఆమోదించడం హర్షణీయం, అన్ని రాష్ట్రాలకు కలిపి ఈ ఆర్ధిక సంవత్సరంలో 1.45 లక్షల కోట్లు రూపాయిలు గ్రాంట్ రూపంలో కేంద్రం నుండి నిధులు వస్తాయి.
ఉపాధి హామీ అమలు లొసుగులను అధిగమించి విబి జీ రామ్ జీ ద్వారా పారదర్శకత తో గ్రామీణ ఉపాధికి గ్యారంటీ ఇచ్చిన బడ్జెట్ కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది , 2024 – 25 ఉపాధి హామీకి కేటాయించిన 86,000 కోట్లకు దాదాపు మరో 10 వేల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించడం జరిగింది. ఈ నిధులకు రాష్ట్రాల వాటా 40% కలిపితే దాదాపు 1.60 లక్షల కోట్ల రూపాయిల నిధులు గ్రామీణ ఉపాధికి వినియోగం లోకి వస్తాయి…. గ్రామీణ ఆస్తులను పారదర్శకతో భారీగా కల్పన చేయడం జరుగుతుంది.
మధ్యతరగతి వర్గాల వస్తూ , సేవల వినియోగం వృద్ధి రేటు పెరిగే అవకాశం
12.21 లక్షల కోట్ల మూలధన వ్యయం మరియు 4.93 లక్షల కోట్ల ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఇస్తున్న గ్రాంట్లు కలిపి 17.14 కోట్లరూపాయిలు అంటే దాదాపు బడ్జెట్ లో ⅓ వంతు నిధులు వినియోగంతో దేశంలో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుంది.
రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలు లక్షల కోట్లు కేటాయించడం శుభపరిణామం
రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని లక్షల కోట్లు మూలధన వ్యయం చేసే ప్రయత్నం కనబడుతుంది.
ఆదాయపన్ను చట్టాలలో టీడీఎస్ మరియు టీసీఎస్ కు సంబంధించి అనేక అంశాలను డీ క్రిమినలైజేషన్ చేయడం మంచి నిర్ణయం – అనవసరపు వేధింపులు ఉండవు మరియు అనేక అంశాలలో టీడీఎస్ ను 2% కు తగ్గించడం జరిగింది.
2025 – 26 సవరించిన జీడీపీ తో అప్పులు 4.4 % ఆంటే ద్రవ్యలోటు నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నం కనబడుతుంది. 2026 – 27 కి 4.4 % కు తగ్గించడం గమనార్హం. రెవిన్యూ మరియు ద్రవ్యలోటు అదుపులో ఉంచడం శుభపరిణామం.
అప్పులతో జీడీపీ నిష్పత్తిని 2031 నాటికి 50% కు తగ్గించెందుకు ప్రణాళిక, 2026 – 27 కి 55% లక్ష్యంగా ఉందిt.
వికాసిత్ భారత్ కోసం ఆర్థిక సంస్కరణలు అవసరం, రాష్ట్రాల కూడా అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
జాతీయ బడ్జెట్ 2026 లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతం ఇచ్చే అంశాలు :
పట్టణాల సమస్యల నుండి అభివృద్ధి కోసం లక్ష కోట్లు, అమృత్ 1 .0 మరియు అమృత్ 2.0 లో ఇచ్చే నిధులతో పట్టణాల మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం ఆంధ్రప్రదేశ్ కి ఉపయోగం, 2019 – 24 మధ్య అమృత్ పనులు పట్టణాలలో సరిగా జరగలేదు, నగరపాలిక సంస్థలకు 1000 కోట్ల మేరకు బాండ్లు ద్వారా నిధుల సమీకరణకు అవకాశం, అందులో 100 కోట్లు కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తున్నందున పూర్తికాని పనులకు నిధుల లభ్యత కలుగుతుంది.
రాజధానిలో 50 కి పైగా వివిధ కేంద్ర సంస్థల నిర్మాణం ఈ సంవత్సరంలో ప్రారంభం అయ్యాయి, ఆయా శాఖల నుండి నిధులు విడుదల అయ్యి ఆ పనులు పూర్తి అవుతాయి.
డాటా సెంటర్ మరియు ఏఐ ఆధారిత పరిశ్రమలకు 2047 వరకు టాక్స్ హాలిడే ప్రకటన చేసినందున, విశాఖలో గూగుల్ డాటా సెంటర్, అమరావతి లో ఏర్పాటు కానున్న ఏఐ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం లభించి మరిన్ని ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పారిశ్రామిక వాడల కోసం మరియు సి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి కొనసాగుతున్నాయి. విద్య, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యాపారవేత్తలుగా యువతను తీర్చిదిద్దడానికి హై పవర్ కమిటీ మరియు 5 యూనివర్సిటీ టౌన్షిప్ లను పారిశ్రామిక కారిడార్లలో ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ కు ప్రకటన, విశాఖ పారిశ్రామిక కారీడార్ అభివృద్ధికి అందే కేంద్ర ప్రభుత్వ సహకారంకు ఈ యూనివర్సిటీలను అనుసంధానించికునే అవకాశం.
దేశంలోనే అతి ఎక్కువ మంది లాక్ పతి దీదీలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. షీ ( సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్స్ ) ద్వారా లాక్ పతి దీదీలకు రుణాలు మంజూరు తేలిక అయ్యి మరింత మంది లాక్ పతి దీదీ లను తయారు చేయవచ్చు .
ప్రతి జిల్లాలో ఓకే మహిళా హాస్టల్ – వీజీఎఫ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మన రాష్ట్రంకు నిధులు వస్తాయి.
అత్యధునిక ట్రామా మరియు ఎమర్జన్సీ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం, రోడ్ ప్రమాదాలకు గురైన వారికి తక్షణ వైద్య సహాయంతో ప్రాణాలు కాపాడటానికి ఉపయోగ పడుతుంది, ప్రస్తుతం రాష్ట్రంలో అందుతున్న వైద్య సేవలకు అనుసంధానం చేయడానికి అవకాశం ఉంది.
దేశంలో 1,00,000 ఏ హెచ్ పీ లను ఏర్పాటులో మన రాష్ట్ర వాటా ఉంది మరియు 5 రీజనల్ మెడికల్ టూరిజం రీజనల్ హబ్ లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఇందులో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది . యోగ మరియు ఆయుర్వేద ఉత్పత్తులు సప్లై కోసం కేంద్రం 3 సంస్థల ఏర్పాటుకు ప్రకటన చేసింది, మన రాష్ట్రంలో ఏర్పాటుకు ప్రయత్నం చేయవలసి ఉంది.
హై స్పీడ్ రైల్వే కారిడార్ 7 లో ఆంధ్ర ప్రదేశ్ 3 కారిడార్లలో అనుసంధానం అవుతుంది, చెన్నై మరియు బెంగుళూరుకు అనుసంధానం అయ్యే ఈ కారిడార్ల ఉపయోగం మన రాష్ట్రానికి చాలా ఉంది.
అరుదైన భూ ఖనిజాల ప్రాజెక్టుల వృద్ధి కోసం తెలిపిన 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కు చోటు లభించింది, ఈ ప్రాజెక్టు ద్వారా అతి ఎక్కువ లబ్ది పొందే రాష్ట్రాలు ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్.
అరకు మరియు పులికాట్ సరస్సు ల పర్యాటక వృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం వలన రాష్ట్రంలో పర్యాటకులు గణనీయంగా పెరిగి ఆ ప్రాంతలలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి.
ఈ ఆర్ధిక సంవత్సరంలో వీబీ జీ రామ్ జీ ద్వారా మన రాష్ట్రంలో కనీసం 11 నుండి 13 వేల కోట్ల మేరకు గ్రామీణ ఉపాధి నిధులు కేంద్ర మరియు రాష్ట్ర వాటాతో ఉపాధి కల్పన ద్వారా గ్రామీణ ఆస్తులను అభివృద్ధి చేయవచ్చు.
అమరావతి కోసం 15 వేల కోట్లు & పోలవరం నిర్మాణం కోసం 12,157 కోట్లు గతంలో లో ప్రకటించిన నిధులు – ఖర్చు ఆధారితంగా ఈ సంవత్సరం విడుదల జరుగుతాయి.గత సంవత్సర బడ్జెట్ లో 5 ,936 కోట్లు కేటాయించిన నిధుల విడుదలలో పురోగతి.
నూతన జాతీయ రహదారులు , రైల్వే లైన్లు అనెక్సర్ చూసి కేటాయింపులు గురించి మాట్లాడగలం.
Prajavartha Online Telugu News