Breaking News

ప్ర‌జా స‌మస్య‌ల ప‌రిష్కార‌మే ప్ర‌జాద‌ర్బార్ ల‌క్ష్యం

-ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆదేశాల మేర‌కు 35వ డివిజ‌న్ లో ప్ర‌జాద‌ర్బార్
-స‌మ‌స్య‌లు ప‌రిష్కారం భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జానీకం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ప్ర‌జాదర్బార్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ప‌శ్చిమ నియోజ‌క‌వర్గ టిడిపి నాయ‌కులు తెలిపారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 35వ డివిజన్ డేవిడ్ వీధి బాపిస్ట్ పాలెం లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆదేశాల మేర‌కు శ‌నివారం ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గ టిడిపి నాయ‌కుల‌తో క‌లిసి 35వ డివిజన్ అధ్యక్షులు షేక్ నంద కుమారి ప్రజా దర్బార్ నిర్వ‌హించారు.. ఈ ప్ర‌జాద‌ర్భార్ కి అధిక సంఖ్య‌లో ప్రజ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు త‌ర‌లిరావ‌టం జ‌రిగింది.

టిడిపి నాయ‌కులు ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోర‌గా, అధికారులు కొన్ని స‌మ‌స్య‌ల‌ను అక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రించారు.

ఈ ప్రజా దర్బార్ లో రేష‌న్ కార్డ్ మ్యాపింగ్, కొత్త రేష‌న్ కార్డ్, టిడ్కో ఇళ్లు, ఇంటి స్థలాలు, వితంతు, ఒంట‌రి మ‌హిళ‌ల పెన్ష‌న్లు, దివ్యాంగుల పెన్ష‌న్లు, ఇళ్ల ప‌ట్టాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌స్య‌లు, సీనియ‌ర్ సిటిజ‌న్ స‌మ‌స్య‌లపై ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆర్జీలు పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో నగరల కార్పొరేషన్ డైరెక్టర్ సుకాశి కిరణ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, పశ్చిమ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షలు పైడమాల సుభాషిణి, నియోజ‌క‌వ‌ర్గ తెలుగు మహిళా ప్రధానకార్యదర్శి పితాని పద్మ, ఐటీడీపి అధ్యక్షడు చైతన్య, ప్రధానకార్యదర్శి రమేష్, తెలుగు యువత అధ్యక్షలు ఆర్ మాధవ్, 34 వ డివిజన్ అధ్యక్షులు అడ్డూరి కొండ, 52వ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోలి శ్రీనివాసరావు,బోసుబాబు , 35వ డివిజ‌న్ క‌మిటీ స‌భ్యులు టిడిపి దళిత సీనియ‌ర్ నాయ‌కులు ఇత్తడి చార్లెస్, పైడిమాల రాజు, క్లస్టర్ ఇంచార్జ్ ప్రభుదాసు, కో క్లస్టర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మైలపల్లి రాజు, కర్రి సునీత, పునురి రవికిషోర్, ఐటీడీపీ కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి కొదమల రాజు, యూనిట్ ఇంచార్జి పఠాన్ అసిఫ్, జనసేన ప్రదీప్ రాజు, ఇత్తడి నాగలక్ష్మి, కొట్టేటి సరిత, బంక నాగమణి, సింగపాము భాస్కర్, ఎస్సీ సెల్ చిన్నారావు దాస్, పి రాజు,సింగపాము శీలావతి, లక్కు శాంతి, కొసన లక్ష్మి, పూజల శ్రీను పుప్పాల దుర్గ, పట్నాల భార్గవి, దారా రాజేశ్వరి ల‌తో పాటు ప్రభుత్వ శాఖల నుంచి సివిల్ స‌ప్ల‌య్స్ ఎ.ఎస్.వో, టిడ్కో జె.వో, స‌చివాల‌య సిబ్బంది, పోలీస్ విభాగ సిబ్బంది, హెల్త్, ఎలక్ట్రిక్, కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *