-సీఎం చంద్రబాబు పాలనలో గ్రామాభివృద్ధే లక్ష్యం – ప్రజాసేవే ధ్యేయం : ఎంపీ కేశినేని శివనాథ్
-గుండ్రాయి గ్రామంలో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటన
-పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో బహిరంగ సభ
-పల్లె పండుగ 2.0 కార్యక్రమం లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కెడిసిసిబి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు లతో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్
-రాష్ట్రంలోనే తొలి ‘యానిమల్ హాస్టల్’ ప్రారంభించిన ఎంపీ
-గ్రామాభివృద్ధికి ఊతమిచ్చే పలు పనులకు ఘనంగా ప్రారంభోత్సవాలు
-కమ్యూనిటీ గోశాల, మినీ గోకులాలు, సిసి రోడ్లు, కల్వర్టులు ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్
-రూ.15 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనుల కి శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్
-ఎంపీ కేశినేని శివనాథ్ కు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
-ఎన్టీఆర్ , అంబేడ్కర్ విగ్రహాలు ఘన నివాళి
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో యానిమల్ హాస్టళ్లు కీలక పాత్ర పోషిస్తాయని, జిడిపి లో రెండో స్థానంలో వున్న ఎన్టీఆర్ జిల్లాను పశుసంపద అభివృద్ధి ద్వారా జీడీపీలో జిల్లాను అగ్రస్థానానికి తీసుకు వెళ్లటానికి ముందడుగని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
. జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో శనివారం పల్లె పండుగ 2.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీకేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కెడిసిసిబి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు లకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగింపుగా భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాభివృద్ధికి ఊతమిచ్చే పలు పనులకు ఘనంగా ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఎంపీ , ఎమ్మెల్యేలకు మహిళలకు హారతులు ఇచ్చి స్వాగతం చెప్పారు.
ముందుగా గ్రామంలోని టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ లతో పాటు తదితరులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గ్రామంలో ప్రభుత్వం అందించిన సహకారంతో చిట్టూరి పిచ్చయ్య ఏర్పాటు చేసుకున్న మినీ గోకులం షెడ్డ్ ను, బిసి కాలనీలో రూ.70 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, ఎస్సీ కాలనీలో రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన కల్వర్టులు , రూ.10 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ గోకులం షేడ్ ను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తో కలిసి ప్రారంభించటంతో పాటు, అదే విధంగా రూ.15 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనుల కి ఎంపీ కేశినేని శివనాథ్ శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధికి ఊతమిచ్చే పలు పనులు ప్రారంభోత్సవం జరగటంతో ఆ గ్రామప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభ లో ఎంపీ కేశినేని శివనాథ్ గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన లో గ్రామాభివృద్ధే లక్ష్యం – ప్రజాసేవే ధ్యేయంగా సాగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నరేగా నిధులతో పూర్తైన యానిమల్ హాస్టల్ ను ప్రారంభించటం ఎంతో ఆనందంగా వుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక యానిమల్ హాస్టల్ ఉండే విధంగా ప్రణాళిక సిద్దం చేసిందన్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నాలుగు గ్రామీణ నియోజకవర్గాల్లో జగ్గయ్యపేట లో యానియల్ హాస్టల్ అందుబాటులో రాగా, నందిగామ, మైలవరం, తిరువూరులో మూడు హాస్టల్ కూడా త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు.
ఈ గ్రామంలో సుమారు 700 మంది రైతులు సమిష్టిగా పశుసంపదను సంరక్షించుకునే విధంగా ఈ హాస్టల్ ఏర్పాటు చేయటంలో సహకారం అందించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ డైరీ) సంస్థ పశువుల ఆహార సరఫరా వంటి అంశాల్లో సహకారం అందిస్తోందన్నారు. అతి తక్కువ సమయంలో సుమారు 15–20 రోజుల్లోనే షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించడం గమనార్హమంటూ, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తో పాటు అధికారులు, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం
పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గండ్రాయి గ్రామాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామ ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం తన జీవితంలో మరవలేనిదని ఆయన పేర్కొన్నారు.
గండ్రాయి గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కొటార్ ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గత మూడున్నర దశాబ్దాలుగా జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడిసిసిబి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ సూర్య చంద్రులు లాగా గత 35 ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్ధికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం జమవుతోందని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నామని, వచ్చే ఐదు నుంచి ఆరు నెలల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తుందని తెలిపారు. ఖమ్మం–జగ్గయ్యపేట మధ్య ఫోర్‌లేన్ రహదారి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
వేదాద్రి ఎత్తిపోతల పథకం, ఎన్ఎస్పీ కాలువల ద్వారా సాగునీరు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకుంటామని, వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణం ద్వారా నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.గ్రామంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, గ్రామ సమస్యల పరిష్కారానికి త్వరలో మళ్లీ సందర్శిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ కృషి వల్లే రాష్ట్రంలోనే తొలి యానిమల్ హాస్టల్ జగ్గయ్యపేట ప్రారంభించుకోవటం జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి యానిమల్ హాస్టల్ పైలెట్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ జిల్లాకు తీసుకువచ్చినందుకు నియోజకవర్గ ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షుడు పల్లెబోయిన నాగరాజు, ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి కొట్టారు సత్యనారాయణ ప్రసాద్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో -కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు, కృష్ణ ఫార్మర్ సోసైటీ చైర్మన్ యానాల గోపీ చంద్, సీనియర్ నాయకులు గింజపల్లి రమేష్, చావా నాగేశ్వరరావు, తోట నాగమల్లేశ్వరరావు, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టి.ఎన్.టి.యు.సి జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి లతో పాటు , స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News