Breaking News

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన…

-కంటి, దంత వైద్యం తో సహా అన్ని పరీక్షలు నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన వచ్చింది.. ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు మొబైల్ క్లినికల్ వ్యాన్ లను పశ్చిమ ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శని, ఆదివారాల్లో నిర్దేశిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిట్టినగర్ సయ్యద్ అప్పల స్వామి కళాశాలలో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆప్రాంతానికి చెందిన ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. వివిధ వ్యాధులతో బాధ పడుతున్న వారు. మొబైల్ మెడికల్ వ్యానులలో ఏర్పాటు చేసిన ఈసీజీ, రక్త పరీక్షలు, ఎక్సరే, 2డీ ఎకో తదితర… వైద్య పరీక్షలు, సీనియర్ వైద్యులచే వ్యాధి నిర్ధారణ, నివారణ, నిరోధానికి సంబంధించిన ఉచితంగా మందులు కూడా అదే వాహనాల్లో అందచేశారు. దంత వైద్యులతో పాటు కంటి కి సంబంధించిన వ్యాధులకు సైతం కంప్యూటర్ పై పరీక్షలు నిర్వహించారు. కార్తీక పి.వి.ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు క్యాంపుకు అవసరమైన వైద్యులను, సాంకేతిక సిబ్బందిని సమకూర్చారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ క్యాంపును పర్యవేక్షించారు. కార్యక్రమంలో స్తానిక కూటమి నాయకులు పోతిన రాము, ఉమాకంత్, గుర్రం కొండ, గౌరీ తో పాటు సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వీరమాచినేని కిరణ్, రమణకుమార్, హరీష్ తదితరులు, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *