Breaking News

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర దిశగా తిరుపతిలో మహత్తర శుభ్రత కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు నూతన దిశను చూపించిన స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో, నరేంద్ర మోదీ ఆలోచనలను మార్గదర్శకంగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అమలు అవుతున్న “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమం భాగంగా తిరుపతి నగరంలో విశేషంగా శుభ్రత, పచ్చదనం మరియు సుందరీకరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, మాజీ మంత్రి పానబాక లక్ష్మి, మునిసిపల్ కమిషనర్ మౌర్య, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ తదితర కూటమి నాయకులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, “దేశంలో స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతి భారతీయుని మనసులో బాధ్యతను నాటింది. అదే ఆత్మతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు – ప్రతి ఇంటి, ప్రతి వీధి, ప్రతి పౌరుడి ఉద్యమం కావాలి” అని పేర్కొన్నారు.
“మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అని మనం ఎంత కృషి చేస్తామో, మన వీధి, మన పట్టణం కూడా అంతే శుభ్రంగా ఉండాలనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. అధికారులు మాత్రమే కాదు, ప్రజలు కూడా బాధ్యత తీసుకున్నప్పుడే శాశ్వతమైన మార్పు సాధ్యం అవుతుంది. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు వేస్తాయి” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శుభ్రత ప్రతిజ్ఞ, చెట్ల నాటకం, పరిసరాల శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించగా, యువత మరియు మహిళలు చురుకుగా పాల్గొన్నారు . తిరుపతిని మరింత శుభ్రమైన, పచ్చని, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్యసాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి – ఇదే ఈ కార్యక్రమం సందేశం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *