Breaking News

కొవ్వూరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పర్యటన

కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పర్యటన. గోష్పాద క్షేత్రంలో పుష్కర ఘాట్ల పరిశీలన
పుష్కరాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం రాత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గోష్పాద క్షేత్రం వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొనసాగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ బావన రత్న కుమారి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.. అనంతరం కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు. పట్టణంలో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, వీధి లైటింగ్, చెత్త నిర్వహణ, రహదారుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు.. పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ — 2015 గోదావరి పుష్కరాలు సమయంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొవ్వూరు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినట్లు తెలిపారు. అప్పట్లో ప్రారంభించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు పట్టణ ప్రగతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉండటంతో ప్రస్తుత ఏర్పాట్లు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని చెప్పారు. కొవ్వూరులో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.70 కోట్లతో అమృత్ పథకం కింద టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.14,000 కోట్లతో భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన సుమారు రూ.3,000 కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పట్టణాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. కొవ్వూరులో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాకినాడ సమీపంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తయిన తర్వాత చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఆధునిక సాంకేతికతతో వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. వెంకాయమ్మ చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల మంజూరుకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ — పుష్కరాల నిర్వహణలో మంత్రి నారాయణకు ఉన్న అనుభవం జిల్లాకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అభివృద్ధి నిధులు సమకూర్చడం సులభమవుతోందని తెలిపారు. టిడ్కో గృహాల నిర్మాణానికి రూ.173 కోట్ల విడుదల కూడా మంత్రి ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైందన్నారు. మంచినీటి పైప్‌లైన్ సమస్యలు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే అభినందించారు. రాజమహేంద్రవరం తరహాలోనే కొవ్వూరు పట్టణాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *