కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గోష్పాద క్షేత్రంలో పుష్కర ఘాట్ల ను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు. కొవ్వూరు మున్సిపల్ ఆఫీసులో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష .నారాయణ,మంత్రి కామెంట్స్. కొవ్వూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి 70 కోట్లతో అమృత్ పథకం ద్వారా టెండర్లు పూర్తి చేశాం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు 14,000 కోట్ల తో పనులు ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం 3000 కోట్ల మునిసిపాలిటీ నిధులను పక్కదారి పట్టించింది. కొవ్వూరులో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాకినాడ సమీపంలో నిర్మించే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తయితే కొవ్వూరులో చెత్త అనేది ఉండదు. కొవ్వూరు మున్సిపాలిటీలో ఆధునిక టెక్నాలజీ తో వీధి లైట్లు ఏర్పాటు,చెరువుల సుందరీకరణ చేస్తాం
Prajavartha Online Telugu News