Breaking News

బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత

-బీసీ కళాశాల బాలికల హాస్టల్ ఆకస్మిక సందర్శన
-విద్యార్థినులతో మాట్లాడి సమస్యలపై ఆరా
-బీసీల విద్యకు కూటమి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాజమహేంద్రవరంలోని. జాంపేట గణేశ్ చౌక్ వద్ద ఉన్న బీసీ కళాశాల బాలికల హాస్టల్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ గదులు, మరుగుదొడ్లు పరిశీలించిన మంత్రి వంటగదిని తనిఖీ చేసి, ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించి, వారికి అందుతున్న సౌకర్యాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్వో ప్లాంట్ ద్వారా అందిస్తున్న నీటిని త్రాగి చూడడం జరిగింది. హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు అవుతుందా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ ప్రాంగణంలో కరివేపాకు, మునగ చెట్లు నాటాలని వార్డెన్‌కు సూచించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, బీసీ హాస్టళ్లు మరియు గురుకులాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్థానిక నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *