Breaking News

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న భారీ స్టీల్ ప్లాంట్ – కూటమి ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం

-టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచిందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం గద్దె క్రాంతి కుమార్ 12వ డివిజన్ కృష్ణా నగర్ ఏరియాలో పర్యటించి, పేద దళిత యువకుడు గద్దె కోటి (మరియబాబు)కి స్వయం ఉపాధి నిమిత్తం కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునేందుకు కొబ్బరి బోండాలా బండిని గద్దె క్రాంతి కుమార్ సొంత నిధులతో అందజేసిన ప్రారంభించారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ కు శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయని తెలిపారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత బలపరిచే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. మొత్తం 5,465 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మితమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుగా నిలుస్తుందని, పెట్టుబడులను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని విమర్శించిన గద్దె క్రాంతి కుమార్, కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను యథావిధిగా కొనసాగించడంతో పాటు మరో భారీ స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకురావడం గొప్ప విషయం అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, పారిశ్రామిక పురోగతే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థతను ఈ ప్రాజెక్టు స్పష్టంగా ప్రతిబింబిస్తోందని కొనియాడారు.  రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా ఎదగడం ఖాయమని గద్దె క్రాంతి కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండి బాలయోగి, నూతి శ్రీనివాస్, సాయన సత్యనారాయణ, మాదిరెడ్డి రవి, ఎస్.కె. నాగూర్, గద్దె తంబీ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *