Breaking News

బాపట్ల లో ఏపీఆర్ ఎంఎస్ఎస్ఎస్ ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభ

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
బాపట్ల లో ఏపీఆర్ ఎంఎస్ఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం) ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభ జరిగింది. ఆదివారం బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభకు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు హాజరయ్యారు. సభకు సంఘం ప్రధాన కార్యదర్శి సూరెడ్డి శివకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చకపోవటం బాధాకరమన్నారు. మాజీ సైనికుల కోసం ప్రతి జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. తొలుత సభా ప్రాంగణంలో బాపట్ల అసోసియేషన్ ఏర్పాటు చేసిన యుద్ధ వీరుల స్థూపానికి మాజీ సైనికులు అమర వీరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ బాపట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు పట్నం విశ్వేశ్వరరావు, నజీర్ అహమ్మద్, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, సుంకర శేషగిరి రావు, అడపా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *