Breaking News

ధాన్యం సేక‌ర‌ణ‌పై క‌మాండ్ కంట్రోల్ కేంద్రం

– 91549 70454తో క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ర‌బీ ధాన్యం సేక‌ర‌ణకు సంబంధించి జిల్లా క‌లెక్ట‌రేట్‌లో 91549 70454తో క‌లెక్ట‌రేట్‌లో క‌మాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులో ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రైతుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. రైతులు ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ నంబ‌రుకు ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని సూచించారు. ఈ కేంద్రం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. జిల్లా పౌర స‌ర‌ఫ‌రాల మేనేజ‌ర్ కార్యాల‌యంలోనూ అద‌నంగా 77020 03571 నంబ‌రుతో కంట్రోల్ రూమ్ కూడా అందుబాటులో ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *