Breaking News

ప్రజాదర్బార్ వినతికి వెంటనే స్పందన

-గృహిణికి ఉపాధి భరోసా కల్పించిన P-4 మార్గదర్శి బొండా సిద్దార్ధ
-నాగలక్ష్మి కుటుంబానికి రూ.30,000 వేల రూపాయల టిఫిన్ బండి ని అందజేసిన మార్గదర్శి బొండా సిద్దార్ధ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు గురువారం ప్రజాదర్బార్‌లో గతవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సింగినగర్ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే గృహిణి తన కుటుంబ పోషణ కోసం టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, ప్రస్తుతం రోజువారీ రూ.30 రూపాయలు అద్దె బండి పై ఆధారపడుతూ ఎంతో కష్టపడుతున్నానని, తనకు స్వంత టిఫిన్ బండి కల్పిస్తే మరింత స్థిరంగా ఉపాధి పొందగలనని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని వినతి పత్రం ద్వారా అభ్యర్థించారు.

ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించే శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు వెంటనే స్పందించి, వారం రోజులు కూడా పూర్తికాకముందే P-4 పథకం ద్వారా మార్గదర్శకులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ గారు ముందుకు వచ్చి సుమారు రూ.30,000 విలువ గల ఆధునిక సౌకర్యాలతో కూడిన టిఫిన్ బండిని ఏర్పాటు చేసి లబ్ధిదారురాలికి స్వయంగా అందజేశారు, ఈ టిఫిన్ బండి ద్వారా నాగలక్ష్మి తన వ్యాపారాన్ని విస్తరించుకుని, ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని పొందింది.

ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ… స్వయం ఉపాధి ద్వారానే పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి అని, ప్రజాదర్బార్ ద్వారా వచ్చిన ప్రతి సమస్యను గౌరవంతో స్వీకరించి, తక్షణ పరిష్కారం చూపించడం మా నాయకత్వ ధోరణి అని, నాగలక్ష్మి వంటి మహిళలు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం మాకు ప్రేరణగా ఉంటుంది అని, ఇలాంటి వారికి అవసరమైన సహాయం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం అని, రాబోయే రోజుల్లో కూడా పేదలకు, నిరుపేదలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు కొనసాగిస్తాము అని తెలియజేసారు.

టిఫిన్ బండి అందుకున్న నాగలక్ష్మి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇంత త్వరగా సహాయం చేసిన బొండా ఉమామహేశ్వరరావు కి, బొండా సిద్ధార్థ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సహాయం వల్ల నా కుటుంబానికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మరక శ్రీనివాస్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి SK గౌసియా, డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బూదాల సురేష్, ఇంచార్జ్ SK జాన్ వలి, Sk ఫర్వీన్, SD గౌసియా, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *