Breaking News

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ పీటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం వల్ల వారు గత్యంతరంలేక సమ్మెకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

ఈ సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు ఆవేశంలో ఎటువంటి ఆగాయిత్యాలు, ఆత్మహత్యల వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడకుండా, ఆత్మస్థైర్యంతో పోరాటాన్ని కొనసాగిస్తూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పూర్తి సంఘీభావం తెలుపుతూ, వారి న్యాయపరమైన డిమాండ్ల సాధనకు మద్దతు ప్రకటిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలు, కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుచున్నామని దామోదరరావు, నరసయ్యలు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *