Breaking News

ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలోని నలుగురు ఉద్యోగుల సస్పెండ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. మంగళగిరిలోని ఆహార భద్రత శాఖ (ఇన్స్టిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) ప్రధాన కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్ డి. శిరీష, సీనియర్ అసిస్టెంట్స్ జి అఖిల్, సంగీతరావు, జె. సుజాత సస్పెండ్ కు గురైన వారిలో ఉన్నారు. అనధికారికంగా సెలవుపై వెళ్లడం, విశ్రాంత ఉద్యోగికి ఆర్ధిక ప్రయోజనాల చెల్లింపుల విష యంలో తగిన విధంగా స్పందించకపోవడం వంటి కారణాలతో సుజాతను, విధుల నిర్వహణలో ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడం, పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు కనిపించకపోవడం, ఇతర కారణాలతో మిగిలిన వారిని సస్పెండ్ చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం నలుగురిని సస్పెండ్ చేస్తూ ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇంచార్జి డైరెక్టర్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఆదేశాలు జారీచేశారు. విధుల నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టంచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *