Breaking News

రేపు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-కండ్రిగలో జరిగే ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:00 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి ఉదయం 11:00 గంటలకు యాదమర్రి మండలం కండ్రిగ గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజా వేదికలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:35 గంటలకు సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2:20 గంటలకు సంతగేటు దగ్గర నిర్వహించే క్యాడర్ సమావేశంలో పాల్గొని పార్టీ కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4:00 గంటలకు తిరిగి ప్రయాణమై అమరావతికి చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *