-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక
-మన చుట్టూ ఉన్న ప్రతి అంశం సైన్సుతో ముడిపడి ఉంది..
-నూతన ప్రయోగాలు ద్వారానే సైన్సు సంబందిత కొత్త కొత్త విషయాలు వెలువడతాయి..
-డైట్ కళాశాలల్లో నాడు-నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తాం…
..విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
గుడ్లవల్లేరు(అంగలూరు), నేటి పత్రిక ప్రజావార్త :
బోధన ద్వారా నేటి విద్యార్థులను భావి తరాల ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సైన్సు కాంగ్రెస్ సెమినార్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఎంతోగానో దోహద పడుతుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు.
గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలోని డైట్ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సైన్సు కాంగ్రెస్ సెమినార్ కు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, పాఠశాల విద్యశాఖ ప్రదాన కార్యదర్శి బి.రాజశేఖర్ ముఖ్య అతిధులుగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్శన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలోను చేయని విధంగా నేడు అంగలూరు డైట్ కళాశాలలో రాష్ట్ర స్థాయి సైన్సు కాంగ్రెస్ సెమినార్ ద్వారా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయుల్లోని ప్రతిభా నైపుణ్యాన్యాలను వెలికితీయవచ్చున్నారు. భావితరాల పౌరులైన నేటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేంచే ఉపాధ్యాయులు దేవునితో సమానమన్నారు. మన చుట్టూ ఉన ప్రతి అంశం సైన్సుతో ముడిపడి ఉందని ప్రతి విద్యార్థి విద్యాదశ నుంచే సైన్సు సంబందిత కొత్తకొత్త విషయాలను ప్రయోగాల ద్వార తెలుసుకొని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను గెలిపించే విధంగా బోధన చేస్తూ శాస్త్రీయ విజ్ఞానంతో కూడిన ప్రయోగాలు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. డైట్ కళాశాల అభివృద్దికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా తన వంతు సహాకారాన్ని అందిస్తాన్నారు.
పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుంచే సైన్సు సంబందిత అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. జీవితంలో సైన్స్ ఫిక్ టెంపుర్ నిత్యం జరిగే ప్రక్రియ అటువంటి అంశాలను విద్యార్థులకు బోధించాలన్నారు. 2024 నాటికి ప్రపంచస్థాయిలో 24 లక్షలకు పైగా సైన్స్ టెక్నాలజీ ఇంజినీరింగ్ మేథమేటిక్స్(స్టెమ్) బేస్డ్ ఉద్యోగాలు దొరుతాయనే అంచనా ఉంది. సైన్సులో కూడా మహిళలు రాణించాలన్నారు. పరీక్షల్లో ఎలా పాస్ అవ్వాలనేది చూస్తున్నారు కాని సబ్జెక్టు పట్టు సాధించే విధంగా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. నేడు విదేశాల్లో ఉద్యోగాలు నిమిత్తం వెళుతున్నవారిలో కూడా సైన్సు బెస్డ్ నాలెడ్జి ఉందని చెప్పలేము. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రాణించాలన్నదే ముఖ్యమంత్రి ప్రగాడ కోరిక అన్నారు. ఆమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థినీ గ్లోబల్ స్టూడెంట్సు గా తయారు చేయాలన్నదే సీయం లక్ష్యం అన్నారు. డైట్ ద్వారా శిక్షణ పొందుతున్న టీచర్లు కు టీచింగ్ ఎంతో అవసరం కనుక రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాల్లలో పూర్తి స్థాయిలో ప్యాకల్టీని అందించారన్నారు. రాష్ట్రంలోని 13 డైట్ కళాశాలలో నాడు-నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. నేడు నాసా, ఇస్రోలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా రాకెట్సు పంపుతున్నాయన్నారు. ప్రతి విద్యార్థి సైన్సు నేర్చుకోవడం చాలంజ్ గా తీసుకోవాలన్నారు. తెలియని అంశాలు తెలుసుకునే తత్వం పిల్లల్లో రావాలన్నారు. సైన్సు సంబందింత ఆక్సిజన్, వైరస్, బాక్టీరియా వంటి అంశాలను కోవిడ్ మనకు నేర్పిందన్రు. దీనితో పాటు పొదుపు అంశాన్ని కూడా నేర్పిందన్నారు.
సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టరు వెట్రి సెల్వి మాట్లాడుతూ సైన్సు ప్రాముఖ్యతన అందరూ తెలుసుకోవాలన్నారు. లైఫ్ అంటే సైన్సుతో ముడిపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సైన్సుపరంగా అభివృద్ది చెందాలన్నారు. ఇటవంటి సెమినార్లు నిర్వహించడం వలన సాంకేతికం గా ప్రయోగాలు చేయాలనే మంచి ఆలోచనలు తడతాయన్నారు. చేస్తున్న ప్రతి ఎక్సపెరిమెంట్ ను అబ్జర్వేషన్ చెయ్యాలన్నారు.
విద్యాశాఖ కమీషనరు చిన వీరభద్రుడు మాట్లాడుతూ త్రిపురనేని రామస్వామి జన్మస్థలమైన అంగలూరు డైట్ కళాశాలలో రాష్ట్ర స్థాయి సైన్సు కాంగ్రెస్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సెమినార్ ద్వారా పలు అంశాలు భావితరాలుకు ఎంత ఉపయోగపడతాయన్నారు. పాఠశాలమీద ఎంత సమయం కేటాయిస్తామో డైట్ కళాశాల మీద కూడా అంతే పోకస్ పెట్టలన్నారు. డైట్ ద్వారా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు సుమారు 30 తరాల విద్యార్థులకు పాఠాలను చెబుతారన్నారు.
ఈ సందర్బంగా డైట్ కళాశాల లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. జాతీయ స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్ స్పైర్ అవార్డు అందుకున్న పలువురు విద్యార్థులకు యశస్వినీ,సయ్యద్ గఫర్లకు సర్టిఫికేట్స్ మెమోంటోలు అందజేశారు. అనంతరం డైట్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన,వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి మెమెంటోలను అందజేశారు. భారత స్కౌట్స్అండ్ గైడ్స్ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ఎన్ ఎస్ఎస్. పోస్టరును ఆవిష్కరించారు.
సెమినార్ కు హజరైన డైరెక్టరు బి.ప్రతాప్ రెడ్డి, రీజనల్ డైరెక్టరు, డి. మధుసూధనరావు, డీఇవో తహేరా సుల్తానా, ఏపీకోస్టు మెంబర్ సెక్రటరీ వై అపర్ణ లు ప్రసంగించగా, డైట్ కళాశాల ఫ్రిన్స్ పాల్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో 12 జిల్లాల నుంచి వచ్చిన శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News