జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట మున్సిపాలిటీ కి ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లి వారు పార్టీకే ఓటు వేసేలా అవగాహన కల్పించాలని వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం జగ్గయ్యపేట 1,2,31 వార్డు ల ఎన్నికల ప్రచారంలో మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను, కేడీసీసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు లతో కలిసి అవినాష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది అని అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల భారీ విజయలే అని,అదేవిధంగా ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు అన్నింటిలో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.జగన్ గారి నాయకత్వం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన,ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాళ్లకు మళ్ళీ పరాభవం ఎదురుకాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయుకులు ఏలూరి శివాజీ, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, N.S రాజు మరియు ఆయా డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News