-రోడ్డు ప్రమాదంలో బాధితుడి జీవితాన్ని రక్షించిన మంచి సమరిటన్‌కు అవార్డు మంజూరు కోసం ప్రత్యేక పథకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా అత్యవసర పరిస్థితిలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి , వారి మనోధైర్యాన్ని పెంపొందించడానికి ప్రజలను ప్రేరేపించడానికి ఒక చొరవగా, తక్షణ సహాయం అందించడం మరియు వైద్య చికిత్స అందించడానికి ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్‌లోపు ఆసుపత్రి , ట్రామా కేర్ సెంటర్‌కు తరలించడం , రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రజలను ప్రోత్సాహించేందుకు మంచి సమరిటన్ (good samaritan) అవార్డు అందించే పధకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి మంచి సమరిటన్‌కు అవార్డు కింద నగదు బహుమతులు అందించబడతాయి. ఒక సంఘటనకు 5000/- మరియు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ పది మంది మంచి సమారిటన్‌లకు రూ. 1,00,000/- ప్రతి ఒక్కటి సర్టిఫికేట్ , ట్రోఫీతో పాటు జాతీయ రహదారి భద్రతా నెలలో ఢిల్లీలో మోర్తా ద్వారా అందిస్తారు. పైన పేర్కొన్న పథకాన్ని సాధారణ ప్రజలలో తగిన విధంగా ప్రచారం కల్పించేందుకు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో భాగంగా “మంచి సమరిటన్‌కు అవార్డు మంజూరు కోసం జిల్లా స్థాయి అంచనాల కమిటీ”ని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా,డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ మెంబర్ సెక్రటరీగా ,విజయవాడ నగర పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్, డియంహెచ్ఓ, సభ్యులుగా కమిటీలో వుంటారు.
మంచి సమారిటన్‌కు అవార్డుల మంజూరు పథకం కోసం అనుసరించే విధి విధానాలను ఆ ఉత్తర్వులు ల్లో పేర్కొన్నారు. ఏ)పోలీస్ స్టేషన్ లేదా ఆసుపత్రికి కమ్యూనికేషన్ అందిన తర్వాత, కమిటీ ప్రతినెలా ప్రతిపాదనలను సమీక్షించి, ఆమోదించాలి. బి) ఆమోదించబడిన ప్రతిపాదనలు అవార్డుకు నామినేట్ చేయబడిన వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు అవసరమైన చెల్లింపు కోసం రవాణా కమిషనర్‌కు పంపబడతాయి. సి) జిల్లా కమిటీ నుండి ఆమోదించబడిన ప్రతిపాదనలను స్వీకరించిన తర్వాత, రవాణా కమీషనర్ అవార్డుకు నామినేట్ చేయబడిన వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతాకు నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. డి) స్కీమ్ కింద ఖర్చు చేసిన మొత్తాన్ని నెలవారీ రీయింబర్స్‌మెంట్ కోసం రవాణా కమీషనర్ కేంద్ర ప్రభుత్వ,మోర్తా కార్యాలయానికి నెలవారీ నివేదికను పంపాలి. ఇ) రవాణా కమీషనర్ ఈ ప్రయోజనం కోసం మోర్త. ద్వారా అభివృద్ధి చేయబడిన పోర్టల్‌లోకి అవార్డు పొందిన మంచి సమరిటన్ వివరాలను అప్‌లోడ్ చేయాలి.
మంచి సమరిటన్ అవార్డు మంజూరు కొరకు అవసరమైన అనుమతుల కోసం జిల్లా స్థాయి అంచనాల కమిటీ ముందు ప్రతినెలా 5వ తేదీలోగా ప్రతిపాదనలు ఉంచాలని , ఎంపిక చేసిన మంచి సమరిటన్‌లకు చెల్లింపుల కోసం ఆమోదించిన ప్రతిపాదనలను రాష్ట్ర రవాణా కమిషనర్‌కు పంపాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ ను కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశిస్తూ ఈ విషయంలో రాష్ట్ర రవాణా కమిషనర్ కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News