Breaking News

బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీవై పార్టీ యువ నాయకుడు సాయి గోపి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. పెద్ద సంఖ్యలో యువత, పార్టీ కార్యకర్తలు రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీవై పార్టీ నిర్మాణ కోఆర్డినేటర్ అంగిరేకుల ఆదిశేషు, ఏపీ పీఏసీ సభ్యురాలు ఆకుల జయ కళ్యాణి, మంగళగిరి అసెంబ్లీ కన్వీనర్ తోట శివరామకృష్ణ, ప్రత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ యెర్రాకుల భాస్కర్ రావు, రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ కాగితాల స్వాతి గౌడ్, మంగళగిరి యువజన కో-కన్వీనర్ అడిన సతీష్ బాబు, ఏపీ ఎస్‌ఈసీ సభ్యులు అరిగెల శ్రీనివాసులు, గుంటూరు జిల్లా యువజన కో-కన్వీనర్ బత్తుల నాగరాజు, ఏపీ ఎస్‌ఈసీ సభ్యులు కూచిపూడి వాసుదేవరావు, ఏపీ పీఏసీ సభ్యులు కందికట్టు నరసింహారావు, ఏపీ రైతు విభాగం కన్వీనర్ అనగాని రాంప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోడే రామచంద్ర యాదవ్ ప్రజా సంక్షేమం, సామాజిక సేవ లక్ష్యంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వారి పుట్టిన రోజు పురస్కరించుకుని నిర్వహించిన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు డా ఎన్.వి. రావు, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు గోరంట్ల శ్రీనివాసరావు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ నుండి డా జాస్మిన్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు డా వి. శ్రవణ్ కుమార్, వైద్య శిబిరం (మెడికల్ క్యాంప్) వైద్యురాలు డా లలిత అతిథులుగా హాజరయ్యారు. విజయవాడ జీజీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంజిత సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *