తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లాలో ఘనంగా విజయోత్సవ సభ నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జ్ సుగవాసి ప్రసాద్ బాబు, అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు పుల్లి నరేందర్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సభలో పాల్గొని ప్రసంగించారు. అదేవిధంగా జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బెజవాడ దినేష్, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చిన్నా రాయల్, తంబళ్లపల్లె నాయకులు పోతుల సాయి నాథ్ సహా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌కు పలు జాతీయ స్థాయి అవార్డులు రావడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News