Breaking News

ప్రజా సేవలో రెవెన్యూ శాఖ పాత్ర అమూల్యం

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ‌నివారం కలెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో రెవెన్యూ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేయడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి ప్రజలకు అందించడంలో రెవెన్యూ శాఖ ముందుండి పనిచేస్తోందని తెలిపారు. భూ సంబంధిత సేవలు, విపత్తు నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, సామాజిక భద్రతా పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు నిరంతరం సేవలందిస్తున్నారని అన్నారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడం ప్రతి రెవెన్యూ ఉద్యోగి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించడంలో రెవెన్యూ శాఖ పాత్ర అత్యంత కీలకమని జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ అన్నారు.
కార్య‌క్ర‌మంలో ఏవో శ్రీనివాసరెడ్డి, ఏపీఆర్ఎస్ఏ జిల్లా ప్రెసిడెంట్ బత్తిన రామకృష్ణ, కార్యదర్శి యలమంచిలి రవి, కలెక్టరేట్ కార్యదర్శి కమ్మిలి నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *