Breaking News

నీట్ ప‌రీక్ష ప్ర‌తి ద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి

– ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి
– విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వ‌ర్తించండి
– నీట్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ టెలీ కాన్ఫ‌రెన్స్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21న నీట్ (యూజీ) – 2026 పునఃప‌రీక్ష జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లోని ప్ర‌తి ద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వ‌ర్తించాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు.
శ‌నివారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్ నుంచి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కో ఆర్డినేట‌ర్లు, అబ్జ‌ర్వ‌ర్లు, ప‌రీక్షా కేంద్రాల సూప‌రింటెండెంట్లు త‌దిత‌రులు హాజ‌రైన ఈ టీసీలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై దిశానిర్దేశం చేశారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ రాష్ట్ర‌స్థాయి కార్య‌క్ర‌మాలు కూడా ఆదివారం జ‌ర‌గ‌నున్నందున పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రవాణా, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని ప్ర‌తి అధికారి, సిబ్బంది బాధ్య‌తాయుతంగా ప‌నిచేయాల‌ని సూచించారు. జిల్లాలో మొత్తం 31 ప‌రీక్ష కేంద్రాల్లో 10,800 అభ్య‌ర్థులు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 5.15 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌రుగుతుంద‌న్నారు. ప‌రీక్షా కేంద్రానికి అభ్య‌ర్థుల‌ను ఉద‌యం 11 గంట‌ల నుంచి 1.30 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తిస్తార‌న్నారు. బ‌యోమెట్రిక్ తీసుకోవ‌డంలో విద్యార్థుల‌కు చిన్నపాటి అసౌక‌ర్యం కూడా క‌ల‌గ‌కుండా చూసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. బ‌యోమెట్రిక్ త‌దిత‌ర విష‌యాల్లో ఎన్‌టీఏ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *