గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు నగర ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరుకు బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి అందించే ఎన్యూమరేషన్ ఫారాలను, పూర్తిగా నింపి ఇవ్వాలన్నారు. ఆయా ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలు డిజిటలైజేషన్ చేస్తారని తెలిపారు. శనివారానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062, ఓటర్లలో 1,27,030 ఫారాలు పంపిణీ చేయబడి (50.40%), 820 డిజిటలైజ్ చేయబడ్డాయని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లలో 1,30,709 ఫారాలు పంపిణీ చేయబడి (46.92%), 781 డిజిటలైజ్ చేయబడ్డాయని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకొని, ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్ఓలకు త్వరితగతిన అందజేసి, సరైన, తప్పులులేని ఓటరు జాబితా తయారీకి ప్రతి ఓటరు సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News