Breaking News

సర్ పై ప్రతి ఒక్కరూ సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) పై ప్రతి ఒక్కరూ సమగ్ర అవగాహన కల్గి ఉండాలని, ఎటువంటి అపోహలకు గురి కాకుండా విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని తాడికొండ ఈఆర్ఓ ఎం.గంగరాజు కోరారు. శనివారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోల్ రిజిస్టేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ బిఎల్ఓలు, బిఎల్ఏలకు ఎస్‌ఐఆర్‌పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తాడికొండ ఈఆర్ఓ ఎం.గంగరాజు మాట్లాడుతూ బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చినప్పుడు అడిగే పత్రాలను, వివరాలను ప్రజలుముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, వాటిలో ఓటరు స్వయంగా పూర్తి చేసి బీఎల్‌వోకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒక ఫారంపై బీఎల్‌వో సంతకం చేసి ఎక్నాలెడ్జ్‌మెంట్‌గా ఓటరుకు అందజేస్తారని చెప్పారు. ప్రజలు తమ ఓటరు గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే 2002 సంవత్సరంలో తాము లేదా తమ కుటుంబ సభ్యులు నమోదు అయి ఉన్నఓటరు జాబితా, పోలింగ్ కేంద్రం వివరాలు, తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు లేదా నానమ్మల ఎపిక్ కార్డులు అందుబాటులో ఉంటే మ్యాపింగ్ ప్రక్రియ మరింత సులభంగా జరుగుతుందని తెలిపారు. వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు, ఇటీవల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారు, తమ తల్లిదండ్రుల ఓటరు వివరాలను ముందుగానే సేకరించి ఉంచుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ప్రతి ఒక్కరూ బీఎల్‌వోలకు సహకరించి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బిఎల్ఏలు కూడా క్షేత్ర స్థాయిలో ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కల్గించాలని కోరారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ జి.సాంబశివరావు, ఏఈఆర్ఓ సిహెచ్.శ్రీనివాస్, ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ బాలాజీబాష, డిప్యూటీ తహశీల్దారు నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *