Breaking News

అగాధం నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రం

-సంక్షేమానికి రూ. 1.49 లక్షల కోట్లు… అభివృద్ధికి రూ. 1.34 లక్షల కోట్లు
-రుణాల రీ-షెడ్యూల్ తో రూ.8,269 కోట్ల ఆదా
-గత ప్రభుత్వ పెండింగ్ బిల్లుల్లో రూ.19,357 కోట్ల మేర చెల్లింపు
-రూ.30,849 కోట్ల మేర ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు మోక్షం
-86 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్దరణ… రూ.8,695 కోట్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్
-విధ్వంస పాలన వల్ల రూ.6.94 లక్షల కోట్ల మేర జీఎస్డీపీ నష్టం
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. దాని వల్ల కలిగిన ప్రయోజనాలు.. ప్రస్తుతం చేపడుతున్న చర్యలతో భవిష్యత్ అంచనాలు ఎలా ఉంటాయనే అంశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ధిక శాఖపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు. 46 పేజీలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ఆసాంతం పూస గుచ్చినట్టుగా ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సుదీర్ఘంగా చెప్పారు. బడ్జెట్ లెక్కలు.. ఆర్థిక గణాంకాలు అందరికీ తెలియాలన్నారు. వీటిని బ్రహ్మ పదార్ధంగా చూడకూడదని, ప్రతి ఇంటికి వచ్చిన ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు ఎలా చేస్తారో.. తాము కూడా అంతే జాగ్రత్తగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలను అభివృద్ధి-సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు… పెట్టుబడుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వివిధ రకాల పాలసీలను తెచ్చామని వివరించారు. విభజన నాటి పరిస్థితులు… ఆ తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పథంలో నడిపించాం… 2019లో ప్రభుత్వం కొనసాగక పోవడం వల్ల జరిగిన విధ్వంసం, మళ్లీ అధికారంలోకి వచ్చాక గత రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలు.. చర్యలు వంటి వాటిని ముఖ్యమంత్రి సోదాహరణంగా వివరించారు. గత రెండేళ్ల కాలంలో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం అగాధం నుంచి అభివృద్ధి వైపు వెళ్తోందని చెప్పారు. ఇంకా చాలా చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమం కోసం రూ. 1,49,401 కోట్లను ఖర్చు పెట్టామని చెప్పారు. అలాగే అభివృద్ధి పనులకూ భారీగానే నిధులను ఖర్చు పెట్టామని తెలిపారు. దీంట్లో భాగంగా రూ. 1,33,917 కోట్లను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టాయని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే గత ప్రభుత్వం వదిలి వెళ్లిన పెండింగ్ బిల్లులు సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలనూ చెల్లించామని తెలిపారు. ఇవే కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక సంఘం నిధుల బదలాయింపు వంటి చెల్లింపులు కూడా చేశామని లెక్కలతో సహా సీఎం వివరించారు. వైసీపీ పాలనలో చేసిన ఘోర తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.94 లక్షల కోట్ల మేర జీఎస్డీపీ నష్టాన్ని చవి చూసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టులో వివరాలు ఈ విధంగా ఉన్నాయి…

విభజన… ఆ తర్వాత పరిణామాలు

• ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58 శాతం ఏపీకి వచ్చినా.. వనరుల్లో వాటా మాత్రం 46 శాతమే
• రాజధాని కోల్పోవడంతో ఆదాయ సమీకరణపై తీవ్ర ప్రభావం.
• ఆస్తుల కేటాయింపులోనూ ఏపీకి అన్యాయం.
• విభజన అనంతరం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా పెరిగి.. సేవల రంగం వాటా తగ్గింది.
• 2014–19 మధ్య ఏపీ సగటు GSDP వృద్ధిరేటు 13.5 శాతం…
• 2014-19 మధ్య తెలంగాణతో పోల్చుకుంటే రిసోర్స్ గ్యాప్ 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గింది.

2019–24 మధ్య ఆర్థిక నష్టం

• 2019–24 మధ్య రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగించింది.
• 2014–19లో ఉన్న వృద్ధిరేటును కొనసాగించకపోగా… 10.30 శాతానికి పడిపోయింది.
• 2014-19 వృద్ధి రేటు కొనసాగక పోవడం వల్ల రూ.6.94 లక్షల కోట్ల జీఎస్డీపీని నష్టపోయాం.
• తెలంగాణతో తలసరి ఆదాయం 2018–19లో రూ.55,817 ఉండగా.. 2023–24 నాటికి రూ.1,06,854కు పెరిగింది.
• 2025-26లో ఏపీ తలసరి ఆదాయం రూ.2,94,507గా ఉంది.
• 2014–19 సగటు వృద్ధిరేటు కొనసాగి ఉంటే 2025–26లో ఏపీ తలసరి ఆదాయం రూ.3,67,115 ఉండేది. దీని వల్ల ఏపీ తలసరి ఆదాయం రూ.72,608 మేర తగ్గిపోయింది.

ప్రణాళికా బద్దంగా బడ్జెట్ల రూపకల్పన

• 2024-25 ఆర్థిక సంవత్సరంలో గత ప్రభుత్వాలను సరిదిద్దుతూ.. వ్యవస్థలను గాడిలో పెడుతూ కరెక్టివ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
• 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
• 2026-27 ఆర్థిక సంవత్సరానికి మూడు రీజియన్లకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధి ప్రణాళికలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

బిల్లుల చెల్లింపులు… కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్దరణ

• 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న రూ. 48616 కోట్ల పెండింగ్ బిల్లులకు గానూ… రూ. 19,357 కోట్లు చెల్లింపులు జరిపారు.
• గ్రాట్యుటీ, సీపీఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీ-ఇంబర్సుమెంట్ కింద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్లో రూ.30,849 కోట్ల చెల్లింపులు అయ్యాయి.
• 86 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్దరణ కోసం పెండింగులో ఉన్న రూ. 8,695 కోట్లు కేంద్రానికి జమ చేశారు.. యూసీలు సమర్పించారు.
• కేంద్ర ప్రాయోజిక పథకాల పునరుద్దరణతో రాష్ట్రంలో రూ. 45,138 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగితే.. ఇందులో కేంద్రం తన వాటాగా రూ. 29,890 కోట్లు ఇచ్చింది.
• కేంద్ర ప్రాయోజిత పథకాల పునరద్దురణ వల్లే జల్ జీవన్ మిషన్, సమగ్ర శిక్ష, నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్, నరేగా వంటి పథకాలకు ఎక్కువ నిధులు వచ్చాయి.
• గత ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు చెల్లింపులు జరగకుండా పెండింగ్ పెట్టింది.. వీటిల్లో రూ.3142 కోట్ల పెండింగ్ బిల్లులతో సహా మొత్తంగా రూ.7404 కోట్లను స్థానిక సంస్థలకు, వైద్యారోగ్య రంగానికి బదలాయించారు.

రుణాలపై వడ్డీ శాతం తగ్గించేలా రీ-షెడ్యూల్

• మొత్తంగా ఉన్న అప్పుల్లో 370 లోన్లకు సంబంధించి రూ. 1.50 లక్షల కోట్ల అప్పులపై వడ్డీలు తగ్గించేలా బ్యాంకర్లతో చర్చలు జరిపారు.
• 13 శాతంగా ఉన్న అప్పులపై వడ్డీలను 10.90 శాతానికి తగ్గించారు.
• మరికొన్ని అప్పులపై 9.9 శాతం వడ్డీ ఉండగా… వాటిని 9.1 శాతానికి తగ్గించారు.
• ఇంకొన్ని అప్పులపై 8 శాతం వడ్డీ ఉండగా.. వాటిని 7.7 శాతానికి తగ్గించారు.
• దీంతో ఏటా రూ. 1100 కోట్లు ఆదా అవుతోంది. మొత్తంగా రూ. 8269 కోట్ల మేర ఆదా అయింది.

సంక్షేమం కోసం రూ. 1.49 లక్షల కోట్లు

• సూపర్ సిక్స్‌తో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా హామీల అమలు
• గత రెండేళ్లలో సంక్షేమంపై రూ.1,49,401 కోట్లు ఖర్చు.
• ఎన్టీఆర్ భరోసా – రూ.68,296 కోట్లు
• విద్యుత్ సబ్సిడీ – రూ.32,800 కోట్లు
• తల్లికి వందనం – రూ.20,210 కోట్లు
• అన్నదాత సుఖీభవ – రూ.8,724 కోట్లు
• ఎన్టీఆర్ వైద్యసేవ – రూ.5,921 కోట్లు
• బియ్యం సబ్సిడీ – రూ.4,322 కోట్లు
• దీపం 2.0 – రూ.3,724 కోట్లు
• ఫీజు రీయింబర్స్‌మెంట్ – రూ.1,529 కోట్లు
• స్త్రీశక్తి – రూ.1,520 కోట్లు
• ధరల స్థిరీకరణ నిధి – రూ.1,200 కోట్లు
• మత్స్యకార సేవలో – రూ.505 కోట్లు
• ఆటో డ్రైవర్ల సేవలో – రూ.436 కోట్లు
• ఇమామ్‌లు, మౌజిన్‌ల గౌరవ వేతనాలు – రూ.134 కోట్లు
• పాస్టర్ల గౌరవ వేతనాలు – రూ.80 కోట్లు
• ఇప్పటి వరకు పీ4 కింద 11 లక్షల కుటుంబాలను దత్తత… 2.4 లక్షల కుటుంబాలకు అందుతోన్న సాయం.
• 30,607 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
• మెగా DSC–2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు
• 5,757 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

బడుగులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట

• SC సంక్షేమానికి రూ.19,100 కోట్లు – 43 లక్షల మంది లబ్దిదారులు.
• ST సంక్షేమానికి రూ.5,730 కోట్లు – 9 లక్షల మంది లబ్దిదారులు.
• BC సంక్షేమానికి రూ.32,534 కోట్లు – 1.18 కోట్ల మంది లబ్దిదారులు.
• మైనారిటీ సంక్షేమానికి రూ.4,856 కోట్లు – 17 లక్షలకు పైగా లబ్దిదారులు.
• 5 లక్షల మందికి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేయడమే లక్ష్యం.
• మహిళలకు రుణ మద్దతు కింద రూ.2246 కోట్లు… బ్యాంక్ క్రెడిట్ లింకేజీ కింద రూ.43,219 కోట్లు

అభివృద్ధి పనులు.. మూల ధన వ్యయం పెంపుపై దృష్టి

• మూలధన వ్యయాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి
• గత రెండేళ్ల సగటు మూలధన వ్యయం 2019–24 సగటుతో పోలిస్తే 1.5 రెట్లు అధికం.
• అమరావతి రాజధాని పనులకు 2024–26లో రూ.10,057 కోట్లు.
• పోలవరానికి రూ.8,323 కోట్లు.
• పోర్టులకు రూ.5,437 కోట్లు.
• జల్ జీవన్ మిషన్‌కు రూ.1,142 కోట్లు.
• ఎయిర్ పోర్టులకు రూ.2,302 కోట్లు.
• రహదారులకు రూ.3,439 కోట్లు.
• రైల్వేల అభివృద్ధి కోసం రూ.64,417 కోట్లు
• జాతీయ రహదారుల కోసం రూ.38,800 కోట్లు

పీపీపీ ప్రాజెక్టులు… వీజీఎఫ్ అమలు

• పెద్ద ఎత్తున పీపీపీ ప్రాజెక్టుల అమలుకు నిర్ణయం.
• రూ. 1.78 లక్షల కోట్లతో 390 పీపీపీ ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు.
• పీపీపీ ప్రాజెక్టులకు వయబులిటి గ్యాఫ్ ఫండ్ పథకం అమలు… కేంద్ర వీజీఎఫ్ స్కీంతో అనుసంధానం.
• 10 పీపీపీ ప్రాజెక్టులకు రూ. 1850 కోట్ల మేర వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం.

వచ్చే ఆదాయమెంత… జీతాలకు ఖర్చు పెట్టేదెంత…

• 2014-19 మధ్య కాలంలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 87 శాతం జీతాలకు ఖర్చు పెట్టారు.
• 2019-24 మధ్య కాలంలో రాష్ట్ర ఆదాయాలు పడిపోయాయి.. దీంతో వచ్చిన ఆదాయం కంటే జీతాల ఖర్చు పెరిగింది. 110 శాతం జీతాల కోసం ఖర్చు పెట్టారు.
• ఈ కారణంగా జీతాలను నాటి ప్రభుత్వం సరిగా చెల్లించలేకపోయింది.. కొంత మందికి జీతాలను కూడా పెండింగ్‌లో పెట్టింది.
• 2024-26 మధ్య కాలంలో మళ్లీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
• ఫలితంగా ఆదాయాలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం వచ్చే ఆదాయంలో 95 శాతం మేర నిధులను జీతాలకు చెల్లిస్తున్నారు.
• ఇంకా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా జీతాల చెల్లింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *