Breaking News

బీసీల అండ తెలుగుదేశం పార్టీ – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

-మహాత్మ జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ ఇద్దరూ ఎప్పటికీ చిరస్మరణీయులే
-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వందే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని 42వ డివిజన్లో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే మరియు నందమూరి తారక రామారావు విగ్రహాలను ఎంపీ కేశినేని చిన్ని చేతులమీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆవిష్కరించిన అనంతరం పూలమాలలు వేసి ఇరువురు మహనీయులకు ఎంపీ చిన్ని ఘన నివాళి అర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా ఎంపి కేశినేని చిన్ని మాట్లాడుతూ ముందుగా ఇంత గొప్ప నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసిన టిడిపి క్యాడర్ను ఎంపీ చిన్ని అభినందించారు మహాత్మ జ్యోతిరావు పూలే ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము అని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే ఇక్కడ ఉన్న టిడిపి నాయకులంతా నియోజకవర్గం మొత్తం ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు గత ప్రభుత్వ హయాంలోనే అధికార పార్టీ నాయకులు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం లాంటి ఒక గొప్ప వేదికను తీసుకువచ్చి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల ప్రజల నుంచి హర్షాద్రేకాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా నిలిచే లక్ష్యంతో ముందుకు వెళుతుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలను గౌరవిస్తూ 34% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని అన్నారు గత వైసిపి నాయకులు అంతా బీసీలను అనగా దొరికారని బీసీలపై దాడులు చేయించిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఎన్టీఆర్ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనార్టీ సెల్ మహమ్మద్ ఫతావుల్లా శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్ మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ 41,42 క్లస్టర్ ఇంచార్జ్ ఏదుపాటి రామయ్య సోలంకి రాజు జనసేన నాయకురాలు తిరుపతి అనూష గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, పశ్చిమ నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు చైతన్య, మైనార్టీ నాయకులు రెహమాన్ సీనియర్ నాయకులు సతీష్ గారు అశోక్ జస్వంత్ గగన్ శివ ప్రకాష్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *