Breaking News

నగరంలో ముకుంద జ్యువెలరీ స్టోర్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ ‘ముకుంద జ్యువెలరీ’ తన మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను నేరుగా ఫ్యాక్టరీ ధర కుందించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పొదుపును అందించాలనే ముఖ్య లక్ష్యంతో ఈ నూతన స్టోర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మధ్య ఆంధ్రా ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యేలా విజయవాడ ఎంజీ రోడ్డులోని పీవీఆర్ కాంప్లెక్స్, ‘ది గోల్డ్ ఓయాసిస్’ మొదటి అంతస్తులో ఈ ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు.
శనివారం నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు మంత్రి టీజీ భరత్, ఇంకా విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ముకుంద జ్యువెలరీ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ మరియు ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ వ్యాపార నగరంగా వేగంగా విస్తరిస్తోందని, ఇక్కడ ముకుందా జ్యువెలరీ తమ ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను ప్రారంభించడం శుభ పరిణామమని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలను అందుబాటు ధరల్లో అందించడం అభినందనీయమని కొనియాడారు. షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ వినియోగదారుల ఆధునిక అభిరుచులకు, సంప్రదాయ డిజైన్లకు అనుగుణంగా లైట్ వెయిట్ గోల్డ్, క్రాఫ్టెడ్ డైమండ్స్, సిల్వర్ ఆర్టికల్స్ జ్యువెలరీలో విభిన్న రకాల కలెక్షన్లను ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడం వల్ల తయారీ వ్యయం తగ్గి, కస్టమర్లకు గణనీయమైన పొదుపు లభిస్తుందని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థకు ఇప్పటికే కూకట్‌పల్లి, ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర, చందానగర్, జూబ్లీహిల్స్, విజయనగరం, బెంగళూరు, పూర్వీ కేపీహెబి వంటి ప్రధాన ప్రాంతాల్లో స్టోర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. విజయవాడలో తమ 12వ షోరూంను ప్రారంభించామని ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తమ షోరూంలో కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 6 వరకు న తరుగు 6.99 శాతం మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు. తక్కువ బరువుతో భారీ ఆభరణాలను అందించడం ముకుంద ప్రత్యేకతగా ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ముకుంద చైర్మన్ బత్తి నరసింహారెడ్డి, డైరెక్టర్లు నికితా రెడ్డి, దాచేపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *