విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి భవాని పురం ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు తో కలిసి అందజేశారు. విద్యాధరపురం, కామకోటి నగర్ కు చెందిన పటాపంచల హనుమంతరావు (57) హిప్ రీప్లేస్మెంట్ శస్త్ర చికిత్స కొరకు వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News