-ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలి.
-సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రానికి తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టాలి.
-పరిశరాలను పరిశుభ్రంగా వుంచి ప్రజల ఆరోగ్యం కాపాడాటం మన బాధ్యత.
-పంచాయితీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి.
-డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ లేకుండా పారుదలయ్యేల చర్యలు చేపట్టాలి..
-జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివ శంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమ చేయాలని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివ శంకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టరు(అభివృద్ది) క్యాంపు కార్యాలయంలో బుధవారం జగనన్న స్వచ్చ సంకల్పం, స్వచ్చ సర్వేక్షణ, జగనన్న పాలవెల్లువ, ఓటీఎస్, స్పందన వంటి అంశాలపై జెడ్పీసీఈవో, డీపీవో, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్.ఈలతో జాయింట్ కలెక్టరు శివశంకర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న స్వచ్చ సంకల్పం క్లాప్ కార్యక్రమాన్ని అన్నీ గ్రామాల్లో సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రాలకు తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టాలన్నారు. పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది విధి విధానాలను అనుసరిస్తూ బాధ్యాతాయుతంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా వుంచి ప్రజల ఆరోగ్యం కాపాడాటం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్య మన్నారు. ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు మండల గ్రామ స్థాయి అధికారులు ప్రణాళికా బద్దంగా జగనన్న స్వచ్చ సంకల్పం అమలు చేస్తూ క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు, ఎన్జీవోలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. మన ఊరు-మన శుభ్రత అనే అంశంపై గ్రామాల్లో ర్యాలీను నిర్వహించాలన్నారు. జిల్లాలో బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ప్రతి రోజు గార్బేజ్ ఇళ్లలో తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసి చెత్త నిల్వ కేంద్రాలకు తరళించే విధంగా అధికారులు పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించి గార్బేజ్ ను యార్డుకు తరలించిన అనంతరం జగనన్న స్వచ్చసంకల్పం యాప్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా దోమల నివారణ కొరకు గ్రామాల్లో ఎప్పటికప్పుడు డ్రైనేజీల్లో నిలువ నీరు లేకుండా పారుదల అయ్యేలా గ్రామ పంచాయితీ సెక్రటరీలు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చెయ్యాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సూర్య ప్రకాశరావు, డీపీవో జ్యోతి, ఎస్.ఈ.ఆర్ డబ్ల్యూఎస్ డీపీఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News