-జాబితాలో ఉన్న వారు ఈ నెలాఖరు లోపు వార్షిక స్టేట్ మెంట్లు సమర్పించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో గత 5 సంవత్సరాలుగా యాన్యువల్ స్టేట్ మెంట్స్ సమర్పించని న్యూస్ పేపర్లు / పీరియాడికల్స్ మొక్క టైటిల్స్ రద్దుకు చర్యలు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ ఎన్ ఐ) న్యూఢిల్లీ వారి కార్యాలయం నుండి అదనపు ప్రెస్ రిజిస్ట్రార్ రీనా సోనోవాల్ కౌలి (Rina sonowal Kouli) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధమైన న్యూస్ పేపర్లు | పీరియాడికల్స్ సుమారు 400 వరకు వున్నాయని, ఈ జాబితా జిల్లాలో విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్ వారి కార్యాలయాలు, గుడివాడ, బందరు ఆర్ డివో కార్యాలయాల్లో, జిల్లా సమాచారశాఖ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచబడిందని తెలిపారు. ఈ జాబితాలో గల న్యూస్ పేపర్లు / పీరియాడికల్స్ ప్రచురిస్తున్నట్లయితే వెంటనే వార్షిక స్టేట్మెంట్లు ఆర్ ఎన్ ఐ న్యూఢిల్లీ వారికి ఈ నెలాఖరు లోపు సమర్పించవలసిందిగా తెలియజేశారు.
Prajavartha Online Telugu News