Breaking News

నందిగామ మండలంలో అభివృద్ధి పనులను పరిశీలించిన విజయవాడ సబ్‌ కలెక్టర్‌

విజయవాడ / నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ మండలంలో మంగళవారం విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ విసృత్తంగా పర్యటించారు. తొలుత సబ్‌ ట్రెజరీ కార్యాలయ నిర్మాణానికి ప్రతిపాదించిన భూమిని ఆయన పరిశీలించారు. సదరుస్థలంలో వాహనాలు పార్కింగ్‌ చేయడానికి తగినంత స్థలం లేదని, నేరుగా రహదారి కూడా అందుబాటులో లేదని గమనించారు. దృష్ట్యా తహాశీల్థార్‌ కార్యాలయం పక్కన ఉన్న పాత భవనాని సబ్‌ ట్రెజరీకి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నందిగామలో జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదించిన భూమిని సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ పరిశీలించారు. జాతీయ రహదారి యొక్క అలైన్‌మెంట్‌ను చూపించే కంబైన్డ్‌ స్కెచ్‌ను తనిఖీ చేశారు. భూసేకరణ స్థితి, పరిహారం చెల్లింపు, ఏమైన పెండిరగ్‌లో ఉన్న చట్టపరమైన సమస్యల గురించి ఆయన ఆరా తీశారు. తదుపరి నందిగామ గిరిజన గురుకుల పాఠశాలను సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో వాష్‌రూమ్‌లను, డ్రైనేజీ పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. వాటి నిర్వహణ పై సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తు వసతి గృహంలోని వాష్‌రూమ్‌లను సరి చేయాలని అలాగే డ్రైనేజీ సౌకర్యాన్ని మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు. అనంతరం నందిగామలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని సబ్‌కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ పరిశీలించారు. వీరి వెంట తహాశీల్థార్‌ డి. చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *