Breaking News

అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిది… :  సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.వెట్రిసెల్వి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషిచేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సేవలు, త్యాగనిరతి మరువలేనిదని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు పట్టుదల, అకుంఠిత దీక్షను అందరూ అలవర్చుకుని విద్యాకార్యక్రమాలు మరింత విజయవంతంగా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, ఏఎస్పీడీ ఆర్.మధుసూదనరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *