-కళాశాలల్లో చదివే మైనారిటీ విద్యార్ధుల స్కాలర్ షిప్పుల ఆఖరు తేదీ పొడిగింపు ..
-జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి యండి. రియాజ్ సుల్తానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలోని మైనారిటీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కం మీన్స్ జాతీయ ఉపకారవేతనాలు పొందేందుకు ఈ నెల 31 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి యండి.రియాజ్ సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఆప్రకటనలో డిసెంబరు 31వరకు ఆన్ లైన్ వెబ్ సైట్ ఓపెన్ లో ఉంటుందని, కావున జిల్లాలోని మైనారిటీలకు చెందిన (ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బుద్ధులు, పార్శీకులు, సిక్కులు) విద్యార్ధులు పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కం మీన్స్ జాతీయ ఉపకారవేతనముల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె సూచించారు. గతంలో ఉపకార వేతనాలు పొందుతున్న అభ్యర్థులు కూడా రెన్యువల్ చేసుకోవాలని ఆమె తెలిపారు. అర్హత గల మైనారిటీ విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ పాఠశాల/కళాశాలలో విద్యార్ధులచే జాతీయ ఉపకారవేతనముల కోసం దరఖాస్తులు చేయించాలని ఆమె కోరారు. జాతీయ ఉపకారవేతనముల దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ www.scholarships gov.in ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జాతీయ ఉపకారవేతనముల ఆన్ లైన్ లో వచ్చిన ప్రీమెట్రిక్ దరఖాస్తులను పాఠశాల యాజమాన్యాలు డిసెంబరు 31లోగా పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కం మీన్స్ దరఖాస్తులను కళాశాలల యాజమాన్యాలు వచ్చే ఏడాది జనవరి 15లోగా జిల్లానోడల్ అధికారి లాగిన్ కు పంపవలసినదిగా కోరారు.
Prajavartha Online Telugu News