Breaking News

రెండురోజుల సమ్మెను జయప్రదం చేసిన బ్యాంకు ఉద్యోగులకు అభినందనలు… : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రెండు రోజుల సమ్మె జయప్రదం గావించినందుకు ఉద్యోగులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందలు తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ శనివారం  ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతోంది. విలీనం పేరుతో బ్యాంకులను కుదించింది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె జయప్రదంగా నిర్వహించినందుకు సిపిఐ అభినందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి. బ్యాంకుల జాతీయకరణ వల్ల రైతులకు, చిరు వ్యాపారులకు, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు జరిగింది. బ్యాంకులు జాతీయం కాకముందు రైతులకు రూ.100 కోట్లు మాత్రమే రుణాలుగా ఇవ్వగా, జాతీయకరణ జరిగిన తర్వాత రూ.15 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ రంగానికి మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులు ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ యోచనను తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెట్టి పరిస్థితిని మోడీ ప్రభుత్వం కల్పించటం తగదు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకుని, బ్యాంకుల ప్రైవేటీకరణను నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *