విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో అత్యధికంగా ఉన్న కొండ ప్రాంతంలో నివసించే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్య కు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వాటర్ ట్యాంక్ లు,పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్, మసీదు రోడ్డు నందు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ శ్రీమతి అంబడిపూడి నిర్మలా కుమారి ఆధ్వర్యంలో దాదాపు 40లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే మెయిన్ వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న 2,6 డివిజన్ల అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.అదేవిధంగా 5వ డివిజన్ లో మంచినీటి ట్యాంక్ నిర్మాణం కూడా మొదలుపెట్టారు అని అది వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు అభివృద్ధి పనులు లతో వైస్సార్సీపీ ప్రభుత్వం ముందుకు పోతుందని,రాబోయే 30 సంవత్సరాలు జగన్ గారే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి,కార్పొరేటర్లు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు కోటి నాగులు,డేవిడ్ రాజు,చినబాబు మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News