విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ లలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో, సంక్షేమ పథకాలు అమలు లో కార్పొరేటర్ లదే కీలకపాత్ర అని వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నియోజకవర్గ వైస్సార్సీపీ కార్పొరేటర్ లు,కో ఆప్షన్ సభ్యులకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దిశా నిర్దేశం చేశారు.శనివారం తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అవినాష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం లో పాల్గొని కార్పొరేటర్ లకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, నిధుల కేటాయింపు కు గట్టిగా కృషి చేయాలని, ప్రజల వాణిని ప్రభుత్వనికి వినిపించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం మరియు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News