-గృహనిర్మాణ సంస్థ పీడీ కె.రామచంద్రన్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం( ఓటీఎస్) జిల్లా స్థాయి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెల 21 వ తేదీ మంగళవారం గుడివాడ అలంకృత పంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని గృహనిర్మాణ సంస్థ పీడీ కె.రామచంద్రన్ తెలిపారు.
సోమవారం ఆర్డీవో శ్రీనుకుమార్, హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని అలంకృత ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించే జిల్లా స్థాయి జగనన్న సంపూర్ణ గృహ పథకం(ఓటీఎస్) పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను హౌసింగ్ పీడీ రామచంద్రన్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తారన్నారు. గుడివాడలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పేర్ని వెంకట్రామయ్య (నాని), వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టరు జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని జిల్లా స్థాయి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు..
ఆర్జీవో శ్రీనుకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) ద్వారా లబ్దిదారులకు రిజస్టర్ డ్యాక్యుమెంట్లను అందించి వారు నిర్మించుకున్న ఇళ్ళపై పూర్తి స్థాయి హక్కును కల్పిస్తుందన్నారు. తద్వారా లబ్దిదారులు తమ ఇళ్ల పై బ్యాంకుల్లో రుణాలు పొందే సౌకర్యం క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు ద్వారా చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇప్పటి వరకు గృహనిర్మాణ సంస్థలో ఎంత రుణం ఉన్నా ఆయా గ్రామ, పట్టాణ, నగరాల వారీ నిర్ణయించిన ప్రకారం రుసుము ఆయా సచివాలయాల్లో చెల్లిస్తే లబ్దిదారుల ఇంటికి రిజిష్టరు పట్టాను అందించి శాశ్వత హాక్కును ప్రభుత్వం అందిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పీడీ వెంట్ హౌసింగ్ ఈఈ శ్రీదేవి, డిఇ రామోజీ నాయక్, తాహశీల్థారు శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ రంగారావు, యంపీడీవో వెంకటరమణ,డిప్యూటీ తాసిల్దార్ లోకరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News