Breaking News

నగరంలోని పలు సినిమా థియేటర్ల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత

-ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టిక్కెట్ల విక్రయాలు జరగాలి..
-ప్రేక్షకుల ఆన్లైన్ టికెట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని అన్నపూర్ణ, శకుంతల, అప్సర సినిమా థియేటర్లను శుక్రవారం జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సినిమా ప్రదర్శన సమయంలో అయా థియేటర్ కు వచ్చి ప్రేక్షకులను నుంచి ఆన్ లైన్ లో టిక్కెట్ల కు ఎంత ధర చెల్లించారు,ఆఫ్ లైన్ ద్వారా ఎంతమంది టిక్కెట్లను ఎంతకు కొనుగోలు చేశారని, చెల్లించిన రుసుము గురించి వివరాలు అడిగారు. మొత్తం సినిమాలో ఉన్న ప్రేక్షకుల సంఖ్య ఆన్లైన్ టికెట్లు పొందిన వారి వివరాలు, ఆఫ్ లైన్ లో టికెట్లు కొనుక్కున్న వారి వివరాలను పరిశీలించారు.అనంతరం సినిమా హాల్ లో తినుబండారాలకు సంబంధించి క్యాంటీన్ వద్ద ధరల పట్టికను పరిశీలించి, ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన వారి నుండి వారి చెల్లించిన వస్తువు ధరను అడిగి తెలుసుకున్నారు. థియేటర్లో టాయిలెట్లను స్వయంగా పరిశీలించి సినిమా హల్ల కు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం, పాటించాలని, మాస్క్ ధరించాలని, కోవిడ్ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలని థియేటర్ నిర్వాహకులను జెసి మాధవీలత ఆదేశించారు.జెసి వెంట తహశీల్దార్ వి.శ్రీనివాస్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *