మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 61.75 లక్షల మందికి ఒకొక్కరికి రూ.2.500 చొప్పున వైఎస్ఆర్ పింఛన్‌ను కానుకగా అందజేసేందుకు ప్రభుత్వం రూ.1570 కోట్లు ఖర్చు చేస్తుందని, అలాగే కృష్ణాజిల్లాలో 5 లక్షల 27 వేల 146 మంది పింఛనుదారులకు ప్రతి నెల 43 కోట్ల 54 లక్షల రూపాయలు అందచేస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
గురువారం ఆయన మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లలో 452 మందికి వైఎస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని వందలమంది పెన్షనర్లకు ఆయనే స్వయంగా నగదు అందచేశారు. తొలుత మంత్రి పేర్ని నాని ఉదయం 7 గంటల సమయంలో రాజుపేట షాదీఖానా భవనంలో 25 వ డివిజన్ నుండి 40 వ డివిజన్లు 16 సచివాలయాలు పరిధిలో మొత్తం 180 మంది పెన్షనర్లకు నగదును మంత్రి పేర్ని నాని, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ , ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజులు అందచేశారు. మంత్రి పేర్ని నాని పలువురు మహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముస్లిం మహిళకు ‘ నయా సాల్ , పింఛన్ ముబారక్ ” అని శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బుట్టాయిపేట టౌన్ హాల్ లో 13, 15 నుంచి 24 డివిజన్లు 11 సచివాలయాల పరిధిలో 88 మందికి పింఛన్లు ఇచ్చారు. ఆ తర్వాత బై పాస్ రోడ్డులోని వాసవి కల్యాణ మండపం వద్ద 1 వ డివిజన్ 41 నుంచి 50 డివిజన్ వరకు మరో 87 మందికి పింఛన్లు స్వయంగా అందచేశారు, పెడన శాసనసభ్యులు జోగి రమేష్, కె డి సి సి బ్యాంకు ఛైర్మెన్ తన్నేరు నాగేశ్వరరావులు పలువురికి పింఛన్లు అందచేశారు. తర్వాత స్థానిక పరాసుపేటలోని సువర్ణ కళ్యాణ మండపంలో 2 వ డివిజన్ ,12 వ డివిజన్ నుంచి 14 వ డివిజన్ వరకు 97 మంది పెన్షనర్లకు పింఛన్ అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, నిరాదరణకు గురైన వారికి, వృద్ధాప్యంలో ఉన్న అవ్వతాతలకు, భర్త చనిపోయి ఒంటరి మహిళలు ఆకలితో బాధపడకూడదన్నారు. ప్రభుత్వం వారికి చేయూత అందజేయాలనే ఆలోచనే పింఛను కార్యక్రమన్నారు. పేదరికం పోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 34 సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛన్లు కొరకు కార్యాలయం చుట్టూ తిరిగే వారని, చివరకు కలెక్టర్ కార్యాలయం వరకు తిరిగే వారిని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అర్హత ఉంటే పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులుగా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించేనాటికి కృష్ణాజిల్లాలో 4 లక్షల 35 వేల 427 మంది పెన్షనర్లు ఉంటే, వారికి 43 కోట్ల 54 లక్షల రూపాయలు నాటి ప్రభుత్వం వారికి ఇచ్చవారని, అదే పెన్షనర్ల సంఖ్య 5 లక్షల 27 వేల 146 మందికి పెరిగిందని ఈ రెండు సంవత్సరాలలో కొత్తవారికి లక్షకు పైగా పెన్షన్లు జిల్లాలో పెరిగాయని నెల నెల 134 కోట్ల 19 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం మునిసిపాలిటీ పరిధిలో 17 వేల 719 మందికి ప్రతి నెల పెన్షన్ల విలువ 4 కోట్ల 61లక్షల రూపాయలు ఇస్తున్నామని, గత ప్రభుత్వంలో ఇదే మునిసిపాలిటీ పరిధిలో 13 వేల 200 వివిధ రకాల పెన్షన్లకు 1 కోటి 52 లక్షలు మాత్రమే ఇచ్చేవారని. తమ రెండున్నర ఏళ్ళ పాలనలో 4 వేల 519 మంది పెన్షనర్లకు 3 కోట్ల రూపాయలకు పైగా నూతన పింఛన్లు అర్హులకు అందచేయడం జరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, బందెల థామస్ నోబుల్ కవిత, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), మునిసిపల్ కమీషనర్ ఎస్. శివరామకృష్ణ, 50 డివిజన్లకు చెందిన పలువురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఎంపీడీవో జి వి సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News